అభిషేక్ శర్మ డబుల్ సెంచరీ.. ఆసియా కప్ రికార్డు సునామీ

Published : Sep 25, 2025, 01:02 AM IST

Abhishek Sharma : ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ 5 ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అతని ప్రస్తుత అద్భుత ప్రదర్శన నేపథ్యంలో భారత వన్డే జట్టుకు ఎంపిక అవ్వనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

PREV
15
బంగ్లాదేశ్‌ పై అభిషేక్ శర్మ మెరుపులు

ఆసియా కప్ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సూపర్-4లో బంగ్లాదేశ్‌పై కూడా అతని బ్యాటింగ్ దూకుడు కొనసాగింది. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగుల ధనాధన్ నాక్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో సెంచరీ ఛాన్స్ ను కోల్పోయాడు. అయినా అతని ఇన్నింగ్స్ భారత్ కు విజయాన్ని అందించింది.

25
వరుసగా రెండో ఫిఫ్టీ.. 200 పరుగులు

అభిషేక్ శర్మ ఆసియా కప్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో హాప్ సెంచరీ సాధించాడు. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై 75 పరుగులతో అదరగొట్టాడు. దీంతో ఆసియా కప్ ఒకే సీజన్‌లో 200 పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ (276), మహ్మద్ రిజ్వాన్ (281) మాత్రమే ఈ ఘనత సాధించారు.

35
అభిషేక్ శర్మ రికార్డు స్థాయి గణాంకాలు

అభిషేక్ శర్మ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 120 బంతులు ఎదుర్కొని 248 పరుగులు చేశాడు. అతని స్ర్టైక్‌రేట్ 206.66గా ఉంది. సగటు 49.60. మొత్తం 23 ఫోర్లు, 17 సిక్సర్లు బాదాడు. ఈ గణాంకాలతో ఆసియా కప్ 2025లో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో బంగ్లాదేశ్ ప్లేయర్ సైఫ్ హాసన్ (160) ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 156 పరుగులతో ఉన్నాడు.

45
అభిషేక్ శర్మ వ్యక్తిగత రికార్డులు

అభిషేక్ శర్మ ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 22 మ్యాచ్‌లు ఆడాడు. 21 ఇన్నింగ్స్‌లో 783 పరుగులు సాధించాడు. సగటు 35.04, స్ర్టైక్ రేట్ 197.73గా ఉంది. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 135 పరుగులు. మొత్తం 63 ఫోర్లు, 53 సిక్సర్లు కొట్టాడు.

55
అభిషేక్ శర్మ వన్డే డెబ్యూ ఛాన్స్

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ శర్మ త్వరలోనే భారత వన్డే జట్టుకు కూడా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అభిషేక్‌ను భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే ఫార్మాట్‌లో డెబ్యూ చేయడం అభిషేక్ కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలవనుంది.

Read more Photos on
click me!

Recommended Stories