టెస్టుల్లో టీమిండియా నెం.1 స్పాట్‌కి ముప్పు... ఆరేళ్లుగా సాగుతున్న విరాట్ సేన ఆధిపత్యానికి...

First Published May 13, 2021, 12:24 PM IST

ఆరేళ్లుగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌గా కొనసాగుతున్న భారత జట్టు నెం.1 ర్యాంకు మరోసారి ముప్పులో పడింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ భారత జట్టుకి టాప్ ప్లేస్ దక్కింది... అయితే అది ఎంతోకాలం కాపాడుకోవడం విరాట్ సేనకు కష్టమే...

గత ఏడాది కాలంలో 24 టెస్టులు ఆడిన టీమిండియా, 2914 పాయింట్లలో 121 రేటింగ్స్ సాధించి టాప్‌లో ఉండగా... న్యూజిలాండ్ 18 టెస్టుల్లో 2166 పాయింట్ల సాధించి 120 రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉంది...
undefined
ఇంగ్లాండ్ 109 రేటింగ్స్‌తో మూడో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 108 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో, పాక్ 94 రేటింగ్స్‌తో ఐదు, వెస్టిండీస్ ఆరోస్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్బే... ఏడు, 8, 9, పదో ర్యాంకులో ఉన్నాయి...
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ ఆడడానికి ముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది న్యూజిలాండ్. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టులో విజయం సాధిస్తే... కివీస్ టాప్‌ర్యాంకుకి చేరుతుంది...
undefined
అదే మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే, భారత జట్టు టాప్‌ర్యాంకును పదిలపరుచుకుంటుంది. ఆ తర్వాత రెండో టెస్టు గెలిచినా కివీస్‌కి పెద్దగా ప్రయోజం ఉండదు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రిజల్ట్, ఐసీసీ టాప్ ర్యాంకర్‌ను డిసైడ్ చేస్తుంది.
undefined
ఒకవేళ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిస్తే టీమిండియా టాప్ ర్యాంకుతోనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఓడిపోతే మాత్రం రెండో ర్యాంకుకి పడిపోతుంది. ఐదు టెస్టుల సిరీస్‌ ఫలితం కూడా టీమిండియా ర్యాంకుపై ప్రభావం చూపనుంది.
undefined
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017 నుంచి వరుసగా ఐదో ఏడాది కూడా నెం.1 టీమ్‌గా ఇయర్‌ను ముగించింది భారత జట్టు. ఆసీస్ టూర్‌కి ముందు మూడో ర్యాంకుకి పడిపోయినా వరుస విజయాలతో మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చింది టీమిండియా...
undefined
click me!