Shubman Gill Shreyas Iyer
అంతర్జాతీయ క్రికెట్‌లో 9 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు శుబ్‌మన్ గిల్. 24 ఏళ్ల వయసులో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్. కోహ్లీ 17, సచిన్ 14, యువరాజ్ సింగ్ 7 సెంచరీలతో ఉండగా శుబ్‌మన్ గిల్‌కి ఇది ఆరో వన్డే సెంచరీ..
35 వన్డే ఇన్నింగ్స్‌లు ముగిసేసరికి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఇంతకుముందు హషీమ్ ఆమ్లా 1844, బాబర్ ఆజమ్ 1758 పరుగులు చేయగా, శుబ్‌మన్ గిల్ 1917 పరుగులు చేశాడు..
35 ఇన్నింగ్స్‌ల్లో 6 వన్డే సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, టీమిండియా తరుపున అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 46, కెఎల్ రాహుల్ 53, విరాట్ కోహ్లీ 61, గౌతమ్ గంభీర్ 68 ఇన్నింగ్స్‌ల్లో 6 వన్డే సెంచరీలు బాదారు..
Shubman_Ruturaj
ఓవరాల్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6 వన్డే సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఇమామ్ ఉల్ హక్ 27 ఇన్నింగ్స్‌ల్లో, ఉపుల్ తరంగ 29, బాబర్ ఆజమ్ 32, హషీం ఆమ్లా 34 ఇన్నింగ్స్‌ల్లో 6 వన్డే సెంచరీలు చేశారు...
Shubman Gill Century
ఈ ఏడాది రోహిత్ శర్మతో నాలుగు సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్‌లతో తలా ఓ సారి శతాధిక భాగస్వామ్యాలు నెలకొల్పాడు..
కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదాడు సూర్యకుమార్ యాదవ్. వన్డేల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. 2000వ సంవత్సరంలో జోద్‌పూర్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఖాన్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. 2017లో రోహిత్ శర్మ, శ్రీలంకపై నాలుగు సిక్సర్లు బాదాడు.