టీ20 వరల్డ్ కప్‌కి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ... ఆ లోపు జట్టును ప్రకటించాల్సిందే...

Published : Jun 20, 2022, 07:27 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసిన ఏడాదికే మరోసారి పొట్టి ప్రపంచకప్‌ని నిర్వహిస్తోంది ఐసీసీ. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్, రెండేళ్లు వాయిదా పడి  ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఈ టోర్నీకి డెడ్‌లైన్ కూడా ప్రకటించేసింది ఐసీసీ...

PREV
16
టీ20 వరల్డ్ కప్‌కి డెడ్ లైన్ ప్రకటించిన ఐసీసీ... ఆ లోపు జట్టును ప్రకటించాల్సిందే...

అక్టోబర్ 16న క్వాలిఫైయర్ రౌండ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభం కానుంది. నమీబియా, స్కాట్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, యూఏఈతో పాటు మరో రెండు జట్లు... సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించేందుకు పోటీపడబోతున్నాయి...

26

సూపర్ 12 రౌండ్‌కి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్... గ్రూప్ బీ నుంచి బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు అర్హత సాధించాయి... 

36

భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తోనే ఆడబోతోంది. మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 23న జరిగే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు, ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన 3 నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి... 

46
Image Credit: Getty Images

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్లను ప్రకటించేందుకు సెప్టెంబర్ 15 వరకూ జట్లకి గడువు ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). ఈ లోపు జట్లన్నీ పొట్టి ప్రపంచకప్‌ ఆడే 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌లను ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది...

56

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకుని, ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడబోతున్న టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఆడనుంది...

66

ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనే భారత జట్టు, టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి దాదాపు 15 టీ20 మ్యాచులు ఆడబోతోంది. ఈ మ్యాచుల్లో పర్ఫామెన్స్ కారణంగా పొట్టి ప్రపంచకప్ ఆడే తుదిజట్టును నిర్ణయించబోతున్నారు సెలక్టర్లు..  

click me!

Recommended Stories