రిషబ్ పంత్ లేకుండా టీ20లేం, వరల్డ్ కప్‌ ఆడొచ్చు... గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...

Published : Jun 20, 2022, 06:54 PM IST

ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్. టెస్టుల్లో భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించిన రిషబ్ పంత్, టీ20ల్లో మాత్రం ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఇదే టైమ్‌లో ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్‌ల పర్పామెన్స్, రిషబ్ పంత్‌కి పెద్ద గండంగా మారింది...

PREV
16
రిషబ్ పంత్ లేకుండా టీ20లేం, వరల్డ్ కప్‌ ఆడొచ్చు... గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో కలిపి 57 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. తొలి మ్యాచుల్లో చేసిన 29 పరుగులు మినహా మిగిలిన మ్యాచుల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు... 

26

అదీకాకుండా నాలుగు మ్యాచుల్లోనూ రిషబ్ పంత్ అవుటైన విధానం ఒకేలా ఉండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆవల వస్తున్న బంతులను వెంటాడుతూ స్లిప్‌లో, వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతున్నాడు రిషబ్ పంత్... 

36
Image credit: PTI

‘రిషబ్ పంత్ టీమిండియాకి ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్. ఆరంగ్రేటం నుంచి అతని పర్ఫామెన్స్ కంటే క్రేజ్ ఎక్కువ సంపాదించాడు. ఆరంభంలో కొన్ని ఫ్లాప్ పర్ఫామెన్స్‌ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్...

46

రీఎంట్రీ తర్వాత టెస్టుల్లో అతని పర్ఫామెన్స్ బాగుంది. అయితే టీ20ల్లో ఇలా ఆడితే జట్టును గెలిపించలేడు. రిషబ్ పంత్ లేకుండా టీమిండియా టీ20లు ఆడగలదా? అని చాలామంది అడుగుతున్నారు...

56
Image credit: PTI

రిషబ్ పంత్ లేకుండా టీ20లేం ఖర్మ, కావాలంటే టీ20 వరల్డ్ కప్ కూడా ఆడొచ్చు. టీ20 వరల్డ్ కప్‌కి పెద్ద సమయం లేదు. పొట్టి ప్రపంచ కప్‌ టీమ్‌లో రిషబ్ పంత్ ఉంటాడనే గ్యారెంటీ లేదు...
 

66
Image credit: PTI

ఎందుకంటే దానికి ముందు మనకి 10 టీ20లు, ఆసియా కప్ ఉన్నాయి. చెప్పలేం రిషబ్ పంత్ కూడా గాయపడి టీమ్‌కి దూరం కావచ్చు... అతను ఆడకపోయినా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్ ఉన్నారుగా...’ అంటూ చెప్పుకొచ్చాడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా... 

Read more Photos on
click me!

Recommended Stories