రోహిత్ శర్మకు అసలు పరీక్ష ఇప్పుడే... ఇంగ్లాండ్‌లో ఐదో టెస్టు ఓడితే అంతే! కాచుకుకూర్చున్న...

Published : Jun 20, 2022, 04:41 PM IST

కేప్‌టౌన్ టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ అందుకున్నాడు రోహిత్ శర్మ. స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలపై వరుస సిరీస్‌లు గెలవడమే కాదు, క్లీన్ స్వీప్స్ చేశాడు. అయితే రోహిత్ శర్మకు అసలు సిసలు పరీక్ష ఇంగ్లాండ్‌లోనే మొదలుకానుంది. 

PREV
18
రోహిత్ శర్మకు అసలు పరీక్ష ఇప్పుడే... ఇంగ్లాండ్‌లో ఐదో టెస్టు ఓడితే అంతే! కాచుకుకూర్చున్న...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నాలుగు టెస్టులు ఆడిన భారత జట్టు, రెండింట్లో విజయాలు అందుకుని 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన తొలి టెస్టు ఐదో రోజు వర్షం కారణంగా రద్దు అయ్యింది. లేకపోతే భారత జట్టు 3-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచేదే...

28

అయితే ఇప్పుడు అటు ఇంగ్లాండ్, ఇటు టీమిండియా రెండు జట్లు కూడా కొత్త కెప్టెన్లు, కొత్త హెడ్ కోచ్‌లతో బరిలో దిగుతున్నాయి. భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. ఐదో టెస్టు ఆడబోతుంటే... ఇంగ్లాండ్‌ కొత్త టెస్టు సారథిగా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు అందుకున్నారు... 

38

బెన్ స్టోక్స్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయాలు నమోదు చేసింది ఇంగ్లాండ్. ఇది రోహిత్ సేనను ఇబ్బందిపెట్టే విషయం. ఇప్పుడు ఇంగ్లాండ్ జోరుకు బ్రేకులు వేయాలంటే టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

48

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు విదేశాల్లో టెస్టు సిరీస్‌లను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు టీమిండియా ఫ్యాన్స్. న్యూజిలాండ్ టూర్ మినహా ఆ తర్వాత, అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో, ఇంగ్లాండ్ టూర్‌లో అదరగొట్టింది విరాట్ సేన... ఇంగ్లాండ్ టూర్‌లో లార్డ్స్‌ టెస్టులో టీమిండియా గెలిచిన విధానం, నఃభూతో నఃభవిష్యత్...

58

ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేవలం ఓ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే జట్టుకి అందుబాటులో ఉండబోతున్నాడు. కెప్టెన్, హెడ్ కోచ్ మినహా మిగిలిన ప్లేయర్లు అంతా సేమ్. అదే జట్టు.. కాబట్టి కెప్టెన్సీలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది...

68

ఇప్పుడు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ టూర్‌లో ఆఖరి టెస్టులో విఫలమైతే టెస్టు సిరీస్‌ 2-2 తేడాతో సమం చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరాజయం టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిఫ్ 2021-23 ఫైనల్ అవకాశాలను దెబ్బ తీయొచ్చు...

78

అసలే విదేశాల్లో మెరుగైన రికార్డు లేని రోహిత్ శర్మ, కెప్టెన్సీ భారాన్ని మోస్తూ ఇంగ్లాండ్ టూర్‌లో రాణించగలడా? అనేది సగటు టీమిండియా క్రికెట్ ఫ్యాన్ అనుమానం. ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఫెయిల్ అయితే మాత్రం హిట్ మ్యాన్‌ని, బీసీసీఐని ఏకీపారేసేందుకు సిద్ధంగా ఉన్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. 

88

గత ఇంగ్లాండ్ టూర్‌లో విదేశాల్లో తొలి సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ, ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు నుంచే పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చి, టెస్టు సిరీస్‌ అందివ్వాలని కోరుకుంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్..

Read more Photos on
click me!

Recommended Stories