indian team
చెన్నై : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ 2023ను టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. టైటిల్ వేట ప్రారంభించిన రోహిత్ సేన విజయంతో శుభారంభం చేసింది. ఆదివారం చెన్నై వేదికన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ కాస్త తడబడినా బౌలర్లు మాత్రం అదరగొట్టారు. ఇక రన్ మెషీన్ కోహ్లీ (85 పరుగులు), యువ మిడిలార్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ (97 పరుగులు) అదరగొట్టి టీమిండియాను విజయతీరాలు చేర్చాడు. ఇలా ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకున్నా ఆ ఆనందం రోహిత్ సేనలోనే కాదు అభిమానుల్లోనూ కనిపించడంలేదు.
Team India
వరల్డ్ కప్ జరుగుతున్నది మన దేశంలోనే... స్వదేశంలో టీమిండియాకు ఎదురులేదు. ఐపిఎల్ తో పాటు ప్రపంచ కప్ కు ముందు జరిగిన చాలా సీరిస్ లను స్వదేశంలోనే ఆడింది టీమిండియా. ఈ అనుభవమూ భారత్ కు కలిసివస్తుందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ భావించారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ తేలిపోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పుణ్యమా అని విజయం దక్కిందిగానీ లేదంటే టీమిండియా పరువు పోయే స్కోరు చూడాల్సి వచ్చేది. ఇలాగే ఆడితే భారత్ టైటిల్ రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Team India
ఇప్పటికే టైటిల్ రేసులో రోహిత్ సేన వెనకబడిందనే చెప్పాలి. ఆసిస్ పై చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లుగా విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో వెనకబడిపోయింది. కేవలం 0.883 రన్ రేట్ తో ఇప్పటికే గెలుపొందిన జట్ల జాబితాలో చివర్లో నిలిచింది. ఓడిన ఆసిస్ సైతం పాయింట్ల పట్టికలో టీమిండియా తర్వాతి స్థానంలోనే నిలిచింది.
rohit babar
ఇక ఇంగ్లాండ్ ను చిత్తుచేసి భారీ విజయాన్ని అందుకున్న న్యూజిల్యాండ్ 2.149 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత శ్రీలంకపై గెలిచిన సౌతాఫ్రికా 2.040 పాయింట్లతో రెండో స్థానంలో వున్నారు. ఇక మన దాయాదులు పాకిస్థాన్ 1.620 పాయింట్లతో, బంగ్లాదేశ్ 1.438 పాయింట్లతో మనకంటే మెరుగైన స్థానంలో వున్నారు. ఇది ఆడిన మొదటి మ్యాచ్ లోనే టీమిండియా గెలిచిందన్న ఆనందాన్ని కూడా ఆవిరి చేస్తోంది. ఇలాంటి గెలుపుకు కాదు... ఒకేసారి పాయింట్ టేబుల్ అగ్రస్థానానికి ఎగబాకే విజయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Ind vs Aus
ఆస్ట్రేలియా నిర్దేశించిన 200 స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి టీమిండియా ఆపసోపాలు పడింది. ఏ 30 ఓవర్ల లోపే మ్యాచ్ ముగిస్తుందనుకుంటే 41 ఓవర్ల వరకు సాగింది. ఓ దశలో టీమిండియా గెలుపుపైనా అనుమానాలు కలిగాయి. కానీ ఎలాగోలా మ్యాచ్ గెలిచినప్పటికే అతి తక్కువ రన్ రేట్ తో టీమిండియా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికే పరిమితం అయ్యింది.