1. 2002: భారత్ vs దక్షిణాఫ్రికా
భారత డాషింగ్ ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆఫ్ స్పిన్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పి, కొలంబోలో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయంతో భారత్‌ను 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేర్చారు.
ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ 261/9 స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగా 200/3తో మ్యాచ్ ను తన చేతిలోనే ఉంచుకుంది. ఎప్పుడైతే వీరేంద్ర సెహ్వాగ్ బాల్ పట్టుకున్నాడో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చేసింది.
కీలక ఆటగాళ్లైన మార్క్ బౌచర్, జాక్వెస్ కలిస్, లాన్స్ క్లూజ్‌నర్‌లను ఔట్ చేసి, నాటకీయ విజయాన్ని అందించాడు సెహ్వాగ్. శ్రీలంకతో ఫైనల్‌లో భారత్ స్థానాన్ని ఖరారు చేశారు.