బుల్లెట్ లాంటి బంతులు.. ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతామంటున్న టాప్-5 బౌలర్లు

Published : Feb 18, 2025, 09:18 PM ISTUpdated : Feb 18, 2025, 09:31 PM IST

Top-5 bowlers in Champions Trophy: పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పిచ్ లు పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అయితే, ఈ టోర్నీలో కొంతమంది బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి టాప్-5 బౌలర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
బుల్లెట్ లాంటి బంతులు.. ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపుతామంటున్న టాప్-5 బౌలర్లు

Top-5 bowlers in Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం (ఫిబ్రవరి 19న) ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. ఈ క్రమంలోనే క్రికెట్ నిపుణులు, అభిమానులు రాబోయే టోర్నీలో సత్తా చాటబోయే ప్లేయర్లు ఎవరనేదానిపై అంచనాలు వేస్తున్నారు. ఉత్తమ బౌలర్లను ఎంచుకోవడం మొదలుపెట్టారు.

కొంతమంది బౌలర్లు ఇటీవల మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ జట్టుకు విజయాలు అందిస్తుందని ఆశిస్తున్నారు. పాకిస్తాన్, దుబాయ్ పరిస్థితులు పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలం. అందుకే, కొంతమంది బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి విన్నింగ్ టాప్ 5 బౌలర్ల ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

26

1. మహ్మద్ షమీ

బుమ్రా లేకపోవడంతో మహ్మద్ షమీ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్. ఇంగ్లాండ్‌తో వైట్ బాల్ సిరీస్ టీ20ల్లో అంతర్జాతీయ క్రికెట్‌కి తిరిగి వచ్చిన షమీ, రెండు వన్డేల్లో ఆడాడు. ఐసీసీ టోర్నీల్లో షమీ భారత్‌కు నమ్మకమైన బౌలర్. వన్డే ప్రపంచకప్ 2023లో 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అత్యధిక వికెట్లు తీస్తాడని భావిస్తున్నారు.

36

2. విలియం ఓ'రోర్కే

ఇటీవల ముగిసిన వన్డే ట్రై సిరీస్‌లో న్యూజిలాండ్ స్టార్ ఓ'రోర్కే అత్యధిక వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్‌ల్లో 26.83 సగటున ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2024 నుంచి ఆరు మ్యాచ్‌ల్లో 33.22 సగటు, 5.76 ఎకానమీతో తొమ్మిది వికెట్లు తీశాడు. ట్రై సిరీస్ సమయంలో పాకిస్తాన్ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. హైబ్రిడ్ మోడల్ ఉన్నా టోర్నీ పాకిస్తాన్‌లో జరుగుతుంది కాబట్టి ఇది అతనికి ఉపయోగపడుతుంది. ఓ'రోర్కే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్లలో ఒకరిగా నిలుస్తాడని భావిస్తున్నారు.

46

3. ఆడమ్ జంపా

ఆడమ్ జంపా ఆస్ట్రేలియా బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తాడు. ప్యాట్ కమిన్స్, స్టార్క్, హాజెల్‌వుడ్, స్టోయినిస్ వంటి కీలక బౌలర్లు లేని ఆస్ట్రేలియా జట్టులో జంపా మిడిల్ ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తాడు. వన్డే ప్రపంచకప్ 2023, టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన జంపా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అత్యధిక వికెట్లు తీస్తాడని భావిస్తున్నారు.

56
కుల్దీప్ యాదవ్

4. కుల్దీప్ యాదవ్

కుల్దీప్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌ రేసులో ఉన్నాడంటే ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, అతని బౌలింగ్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. ఆసియా కప్ 2023లో భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. కుల్దీప్ తొమ్మిది వికెట్లు తీసి జట్టులో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దుబాయ్ పిచ్‌పై మొత్తం 10 వన్డే వికెట్లు తీసిన కుల్దీప్, ఉపఖండ పరిస్థితుల్లో రాణిస్తాడని నిరూపించుకున్నాడు. దుబాయ్ అనుభవంతో షమీ, జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్‌లో భారత జట్టులో కీ రోల్ ప్లే చేయనున్నాడు. 

66

5. ఆదిల్ రషీద్

ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇటీవల వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో ఇటీవలి వన్డే సిరీస్‌లో 27.29 సగటున ఏడు వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2024 నుంచి 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో ఇంగ్లాండ్ తరపున అత్యధిక వికెట్లు తీశాడు. వన్డే ప్రపంచకప్ 2023లోనూ తొమ్మిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. రకరకాల వేరియేషన్లతో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టగల రషీద్, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్ట. 

Read more Photos on
click me!

Recommended Stories