ఇదే ఐపీఎల్‌లో అయ్యుంటేనా... జడ్డూ ధనాధన్ ఫినిషింగ్ చూసేవాళ్లు! రవీంద్ర జడేజాపై ట్రోల్స్...

First Published | Nov 20, 2023, 10:57 AM IST

ఐపీఎల్, ఐసీసీ టోర్నీలు రెండూ ఎప్పటికీ ఒక్కటి కావు. ఐపీఎల్‌లో సూపర్ సక్సెస్ అయిన వాళ్లు, ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, వెంకటేశ్ అయ్యర్ ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ... 
 

Virat Kohli-Ravindra Jadeja

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత రవీంద్ర జడేజాకి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చింది టీమిండియా..

Virat Kohli

అప్పటికి ఇంకా 22 ఓవర్లు మిగిలి ఉండడంతో జడేజా, దూకుడుగా బ్యాటింగ్ చేస్తే టీమిండియాకి కనీసం 280+ స్కోరు వస్తుందని ఊహించారు. కానీ అలా జరగలేదు...
 

Latest Videos


Ravindra Jadeja

22 బంతులు ఫేస్ చేసిన రవీంద్ర జడేజా 9 పరుగులు చేసి, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లీష్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే జిడ్డు బ్యాటింగ్ చేస్తున్న కెఎల్ రాహుల్, జడేజా అవుట్ అయ్యాక మరింత జిడ్డు బ్యాటింగ్ చేశాడు..
 

Ravindra Jadeja

ఇదే రవీంద్ర జడేజా, ఐపీఎల్ 2023 సీజన్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్‌తో సీఎస్‌కేకి మ్యాచ్‌ ఫినిష్ చేశాడు. అప్పటిదాకా గెలవదని అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్, జడేజా ఫినిషింగ్‌తో ఐదో టైటిల్ కైవసం చేసుకుంది..
 

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుపున అదరగొట్టిన జడేజా, టీమిండియా తరుపున ఆడాల్సి వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడని తీవ్రమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఇదే జడ్డూ 77 పరుగులు చేసి అదరగొట్టాడు..
 

రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా, న్యూజిలాండ్ స్కోరుకి దగ్గరగా రాగలిగింది. అయితే సొంత మైదానంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో మాత్రం జడ్డూ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు.

రవీంద్ర జడేజాతో పాటు కెప్టెన్, మిగిలిన వాళ్లు కూడా ప్రెషర్ తీసుకోవడం వల్లే భారత జట్టు టైటిల్‌కి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది.. 

click me!