వరల్డ్ కప్ ముగియగానే ఐపీఎల్ సందడి షురూ! ఆ నలుగురిని వేలానికి వదిలేస్తున్న సన్‌రైజర్స్...

First Published | Nov 20, 2023, 12:41 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. ఫైనల్‌లో ఎప్పటిలాగే భారత జట్టు చేతులు ఎత్తేసింది. ఈ ఓటమితో కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. దీంతో వీరిని ఊరటనిచ్చేలా ఐపీఎల్ సందడి మొదలైపోయింది. 

Image credit: PTI

డిసెంబర్‌లో జరగబోతున్న ఐపీఎల్ వేలానికి ప్లేయర్ల రిటెన్షన్‌ని ప్రకటించేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి.. 2021 సీజన్ నుంచి అట్టర్ ఫ్లాప్ అవుతూ వస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. 2022లో 8వ స్థానంలో, 2023లో 10వ స్థానంలో నిలిచింది..
 

Image credit: PTI

గత మూడు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ముగ్గురు హెడ్ కోచ్‌లను, కోచింగ్ సిబ్బందిని మార్చినా పర్ఫామెన్స్‌లో మాత్రం రిజల్ట్ కనిపించడం లేదు. 2023 సీజన్‌కి ముందు మరోసారి జట్టులో మార్పులు చేస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్..
 

Latest Videos


2024 సీజన్‌కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నలుగురు ప్లేయర్లను వేలానికి విడుదల చేస్తున్నట్టు సమాచారం. రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ హారీ బ్రూక్‌, 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓ సెంచరీ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ దారుణమైన ప్రదర్శన ఇచ్చాడు.

హారీ బ్రూక్‌ని వేలానికి వదిలి వేయాలని ఫిక్స్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, భారత స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ని కూడా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. రూ.8.25 కోట్లు పెట్టి మయాంక్ అగర్వాల్‌ని కొనుగోలు చేసింది సన్‌రైజర్స్..

కొన్నేళ్లుగా టీమ్‌లో సరైన భారత బ్యాటర్ లేకపోవడంతో ఆ లోటు తీరుస్తాడని అనుకున్న మయాంక్, అస్సలు ప్రభావం చూపించలేకపోయాడు. అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోయాడు..
 

అలాగే ఇంగ్లాండ్ సీనియర్ స్పిన్నర్ అదిల్ రషీద్, వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుస్సేన్‌లను వేలానికి విడుదల చేయాలని ఆరెంజ్ ఆర్మీ మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యిందట. ఈ నలుగురుని వేలానికి విడుదల చేయడం ద్వారా పర్సులో రూ.24.5 కోట్లు వచ్చి చేరతాయి. 
 

click me!