2022 టెస్టు టీమ్‌ని ప్రకటించిన ఐసీసీ... టీమిండియా నుంచి ఒకే ఒక్కడు...

Published : Jan 24, 2023, 04:08 PM IST

ఐసీసీ అవార్డుల హంగామా కొనసాగుతోంది. ఇప్పటికే 2022 ఏడాదికి గాను టీ20, వన్డే టీమ్‌లను ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), తాజాగా టెస్టు టీమ్‌ని ప్రకటించింది. టెస్టు టీమ్‌లో టీమిండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్‌కి చోటు దక్కింది. అతనే రిషబ్ పంత్...

PREV
17
2022 టెస్టు టీమ్‌ని ప్రకటించిన ఐసీసీ... టీమిండియా నుంచి ఒకే ఒక్కడు...

టీ20 టీమ్‌లో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చోటు దక్కగా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్‌లకు స్థానం దక్కింది. టెస్టు టీమ్‌లో మాత్రం టీమిండియా నుంచి రిషబ్ పంత్ మాత్రమే చోటు దక్కించుకోగలిగాడు...
 

27
Usman Khawaja

గత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 496 పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, 2022లో ఏకంగా 1080 పరుగులు చేశాడు. ఉస్మాన్ ఖవాజాతో పాటు వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్‌కి ఐసీసీ టెస్టు టీమ్‌లో ఓపెనర్లుగా చోటు దక్కింది. బ్రాత్‌‌వైట్ గత ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో 687 పరుగులు చేశాడు...

37
Marnus Labuschagne with Travis Head

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్, గత ఏడాది  56.29 సగటుతో 957 పరుగులు చేసి ఐసీసీ టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికైన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఐసీసీ టెస్టు టీమ్‌లోనూ స్థానం సంపాదించుకున్నాడు. బాబర్ ఆజమ్ గత ఏడాది 9 టెస్టులు ఆడి 1184 పరుగులు చేశాడు...

47
Jonny Bairstow-Ben Stokes

ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌ స్టో, గత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరుపున సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు. వెస్టిండీస్, ఇండియా, న్యూజిలాండ్‌పై సెంచరీలు చేసిన బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌కి 9 విజయాలు అందించిన బెన్ స్టోక్స్, ఐసీసీ టెస్టు టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...

57

టీమిండియా నుంచి ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022లో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ రిషబ్ పంత్. గత ఏడాది 12 ఇన్నింగ్స్‌ల్లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు రిషబ్ పంత్. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే గత ఏడాది టెస్టుల్లో 22 సిక్సర్లు బాదిన రిషబ్ పంత్, 6 స్టంపౌట్స్, 23 క్యాచులు అందుకున్నాడు..

67
Pat Cummins with David Warner

ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గత ఏడాది 10 మ్యాచులు ఆడి 36 వికెట్లు తీసుకున్నాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా, గత ఏడాది 9 మ్యాచులు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ గత ఏడాది 11 మ్యాచుల్లో 47 వికెట్లు తీశాడు.. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 36 వికెట్లు తీసి.. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్నారు...

77

ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022: ఉస్మాన్ ఖవాజా, క్రెగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లబుషేన్, బాబర్ ఆజమ్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రిషబ్ పంత్, ప్యాట్ కమ్మిన్స్, కగిసో రబాడా, నాథన్ లియాన్, జేమ్స్ అండర్సన్
 

Read more Photos on
click me!

Recommended Stories