అదంతా ధోనీతోనే పోయింది! ఇప్పుడు అదొక్కటే చేస్తామంటే కుదరదు.. - రాహుల్ ద్రావిడ్

First Published Jan 24, 2023, 3:32 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా దినేశ్ కార్తీక్, పార్థివ్ పటేల్, నమన్ ఓజా, వర్థమాన్ సాహా వంటి ప్లేయర్లు సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయారు. ధోనీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసుకోవడంతో టాలెంట్ ఉన్నా మిగిలిన వికెట్ కీపింగ్ బ్యాటర్లకు చోటు దక్కలేదు...

మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే వృద్ధిమాన్ సాహాకి కానీ రిషబ్ పంత్‌కి కానీ వరుస అవకాశాలు దక్కాయి. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ, క్రికెట్‌కి దూరంగా ఉండడంతో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రేసులోకి వచ్చారు...

Image credit: Getty

రిషబ్ పంత్, సంజూ శాంసన్ తమకి ఇచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోలేకపోవడంతో కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కూడా చేస్తూ వచ్చాడు. మెల్‌బోర్న్ టెస్టు తర్వాత రిషబ్ పంత్, మూడు ఫార్మాట్లలో కమ్‌బ్యాక్ ఇచ్చి భారత జట్టుకి వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా మారాడు...

‘భారత జట్టు ఎప్పటి నుంచో వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం చూస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ రిటర్మెంట్ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్లకు కాలం చెల్లింది. లక్కీగా భారత జట్టుకి చాలామంది వికెట్ కీపింగ్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు...

Image credit: PTI

ఇషాన్ కిషన్ ఉన్నాడు, కెఎస్ భరత్ ఉన్నాడు. ఈ ఇద్దరూ విజయ్ హాజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడారు. భరత్ ఇప్పటిదాకా టీమిండియాకి ఆడకపోయినా ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసి, తానేం చేయగలడో నిరూపించుకున్నాడు...

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడినా కెఎల్ రాహుల్, సంజూ శాంసన్ ఉన్నారు. ఒకప్పుడు వికెట్ కీపింగ్ కోసం స్పెషల్‌గా ప్లేయర్లు ఉండేవాళ్లు. అయితే ఇప్పుడు వికెట్ కీపింగ్ చేసే ప్రతీ ఒక్కరూ బ్యాటింగ్ కూడా చేయాల్సిందే. బ్యాటింగ్‌ బాగా చేస్తే, వికెట్ కీపింగ్ అదనపు అర్హత అవుతుంది...

MS Dhoni-Ravi Shastri

జితేశ్ శర్మను టీ20లకు సెలక్ట్ చేశాం. అతను సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టీమ్‌లో బాగా ఆడాడు. ఐపీఎల్‌లోనూ తానేం చేయగలనో నిరూపించుకున్నాడు...  కుర్రాళ్లు తమకి దక్కిన అవకాశాలను సరిగ్గా వాడుకుంటున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 

click me!