మా వోడు విరాట్ కోహ్లీ అయితే మీ వాడు... హారీస్ రౌఫ్‌తో ఉమ్రాన్ మాలిక్‌‌ని పోల్చడంపై..

Published : Jan 24, 2023, 01:49 PM IST

ఐపీఎల్ నుంచి జెట్ స్పీడ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చాడు ఉమ్రాన్ మాలిక్. ఆడిన అరడజను మ్యాచుల్లోనే టీమిండియా తరుపున ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా వన్డేల్లో, టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు...  

PREV
17
మా వోడు విరాట్ కోహ్లీ అయితే మీ వాడు... హారీస్ రౌఫ్‌తో ఉమ్రాన్ మాలిక్‌‌ని పోల్చడంపై..
Umran Malik

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 14 మ్యాచులు ఆడి 22 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ మాలిక్, వరుసగా 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు...

27

జమ్ముకి చెందిన ఉమ్రాన్ మాలిక్‌ని పాక్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్‌తో పోలుస్తున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఉమ్రాన్ మాలిక్‌ని హారీస్ రౌఫ్‌తో పోల్చడం కరెక్ట్ కాదంటున్నాడు పాక్ మాజీ పేసర్ అకీబ్ జావెద్...
 

37
Umran Malik-Haris Rauf

‘ఉమ్రాన్ మాలిక్‌కి హారీస్ రౌఫ్‌కి ఉన్నంత అనుభవం లేదు. రౌఫ్‌లా ఉమ్రాన్ మాలిక్ ఫిట్ కూడా కాదు. వన్డేల్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ని కరెక్ట్‌గా గమనించండి. తొలి స్పెల్‌లో అతను బాగానే 150 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు...

47
Umran Malik

అయితే 7వ, 8వ ఓవర్ వచ్చేసరికి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ స్పీడ్ భారీగా పడిపోతోంది. ఆరేడు ఓవర్లు వేసిన తర్వాత ఉమ్రాన్ స్పీడ్ 138 కి.మీ.లు మాత్రమే ఉంటోంది. అతనికి వరుసగా 150+ మార్కుని అందుకోవాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి, ఎనర్జీ లెవెల్స్‌ని చివరిదాకా మెయింటైన్ చేయగలగాలి...

57
haris rauf

హారీస్ రౌఫ్, విరాట్ కోహ్లీ అయితే మీవాడు మిగిలిన బ్యాటర్లు. కోహ్లీని మిగిలిన బ్యాటర్లతో పోల్చడం ఎలా కరెక్ట్ కాదో, హారీస్ రౌఫ్ కూడా అంతే. హారీస్ రౌఫ్ తన డైట్ విషయంలో చాలా పక్కాగా ఉంది. ట్రైయినింగ్, లైఫ్ స్టైల్‌ ఎక్కడా లైన్ దాటడు...

67

హారీస్ రౌఫ్‌లా పక్కా డైట్ ఫాలో అయ్యే ఒక్క బౌలర్‌ని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. లైఫ్ స్టైల్ విషయంలోనూ అంతే. చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటాడు. నా ఉద్దేశంలో 160 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయడం పెద్ద విషయం కాదు, అయితే అదే స్పీడ్‌ని మ్యాచ్ మొత్తం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం...’ అంటూ చెప్పుకొచ్చాడు అకీబ్ జావెద్..

77
Haris Rauf

2020లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన హారీస్ రౌఫ్ ఇప్పటిదాకా ఓ టెస్టు, 18 వన్డేలు, 57 టీ20 మ్యాచులు ఆడి 103 వికెట్లు తీశాడు. అయితే 2022 టీ20 వరల్డ్ కప్‌లో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు బాది మ్యాచ్‌ని మలుపు తిప్పాడు విరాట్ కోహ్లీ...

Read more Photos on
click me!

Recommended Stories