Image credit: PTI
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్, సింగిల్ డిజిట్ స్కోరును దాటలేకపోయాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో స్టంపౌట్ అయిన దినేశ్ కార్తీక్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
Image credit: Getty
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో 3 ఇన్నింగ్స్‌లు, 2010లో 2 ఇన్నింగ్స్‌లో, 2022లో మూడు ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్... ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు...
Rishabh Pant-Rohit Sharma
‘రిషబ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, దినేశ్ కార్తీక్‌ని ఆడిస్తున్నారు. పంత్ లాంటి ప్లేయర్‌ని కూర్చోబెట్టినా గెలవగలిగే సత్తా టీమిండియా దగ్గర ఉండొచ్చు కానీ ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మ్యాచ్ విన్నర్లను ఎక్కువ మ్యాచులు ఆడిస్తూ ఉండాలి...
Image credit: Getty
ఆడుతూ ఉంటే ప్లేయర్లు ఫామ్ కోల్పోకుండా ఉంటారు. అయినా రిషబ్ పంత్‌ని కాదని దినేశ్ కార్తీక్‌ని ఆడించడంలో ఏ లాజిక్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా చేయడం వల్ల ఏ ఉపయోగం కలుగుతుందో టీమిండియా మేనేజ్‌మెంటే సమాధానం చెప్పాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ ఇయాన్ చాపెల్...
Image credit: Getty
‘కొన్నాళ్ల క్రితం విరాట్ కోహ్లీని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడాడు. అయితే పెద్దగా రిస్కీ షాట్స్ ఆడలేదు. నేను అతన్ని దీని గురించి అడిగాను. ఇంత బాగా సెటిల్ అయినప్పుడు ఫ్యాన్స్ షాట్స్ ఎందుకు ఆడలేదని ప్రశ్నించా...
దానికి విరాట్ కోహ్లీ... ‘‘నా టెస్టు గేమ్‌ని అవి చెడగొట్టకూడదు కదా...’ అని సమాధానం చెప్పాడు. విరాట్ కోహ్లీ గొప్పదనం అదే. అతను ఏ ఫార్మాట్‌కి ఎలాంటి గేమ్ అవసరమో అతనికి బాగా తెలుసు. అంతేకానీ నేను ఈ షాట్స్ ఆడగలనని చూపించాలని అనుకోను... నార్మల్ క్రికెటింగ్ షాట్స్‌తోనే చేయాల్సిన డ్యామేజీ చేసేస్తాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్..