అతని కంటే రవిచంద్రన్ అశ్విన్ ది బెస్ట్... సంజయ్ మంజ్రేకర్‌కి కౌంటర్ ఇచ్చిన ఇయాన్ చాపెల్...

First Published Jun 6, 2021, 3:46 PM IST

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌టైం గ్రేట్ కాదని, అతను విదేశీ పిచ్‌లపైన సరిగా రాణించలేడంటూ కామెంట్లు చేశాడు. అయితే మంజ్రేకర్‌కి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు...

‘రవిచంద్రన్ అశ్విన్‌ని ఆల్‌టైం గ్రేట్ స్పిన్నర్లలో ఒకడిగా చెబుతుంటారు చాలామంది. అయితే నేను దీన్ని ఒప్పుకోను. ఎందుకంటే అతనిలో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా అశ్విన్ సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా ఐదు వికెట్లు తీయలేకపోయాడు...
undefined
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌కి భారత పిచ్‌లే సరిగ్గా సూట్ అవుతాయి. గత నాలుగేళ్లలో అతను ఆశించినంతగా రాణించడం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే జడేజా కూడా ఐదేసి వికెట్లు తీస్తూ అతనితో సమానంగా రాణిస్తున్నాడు.
undefined
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా రవిచంద్రన్ అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అందుకే అతన్ని ప్రస్తుత తరంలో బెస్ట్ స్పిన్నర్‌గా ఒప్పుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.
undefined
అయితే ఇయాన్ చాపెల్ దీన్ని కొట్టిపారేశాడు. ‘ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. నీకు విండీస్ దిగ్గజం జోయల్ గార్నర్ గురించి తెలుసనుకుంటా. అతను కూడా పెద్దగా ఐదేసి వికెట్ల ప్రదర్శన చేయలేదు. అయితే అతని బౌలింగ్‌ను వెలకట్టడానికి ప్రతీ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కొలమానం కాదు...
undefined
ఆ సమయంలో మిగిలిన గొప్ప ప్లేయర్ల కంటే అతను మెరుగ్గా రాణించాడంటే జట్టుకి అంతకంటే ఏం కావాలి. ఇప్పుడు భారత జట్టు బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. అందుకే బౌలర్లు వికెట్లను పంచుకుంటున్నారు. ఒకే బౌలర్‌కి ఐదు వికెట్లు దక్కే అవకాశం తక్కువ...
undefined
ఇంగ్లాండ్ సిరీస్‌లో అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయకపోవడానికి అతన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన కోహ్లీ, అతనితో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించాడు... అందుకే ఎక్కువ వికెట్లు దక్కాయి.
undefined
ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ కంటే రవిచంద్రన్ అశ్విన్ చాలా బెటర్ అండ్ బెస్ట్ బౌలర్. నాథన్ లియాన్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ ఈజీగా పరుగులు చేస్తున్నారు. కానీ అతనికి కూడా ఆశించినంతగా వికెట్లు రావడం లేదు. అదే సమయంలో అశ్విన్ అదరగొడుతున్నాడు...
undefined
ఇషాంత్ శర్మ కూడా ఈ మధ్యకాలంలో చాలా మెరుగయ్యాడు. 2018కి ముందు అతని పర్ఫామెన్స్, ఆ తర్వాత పర్ఫామెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2018 నుంచి ఈ మూడేళ్లలో 22 టెస్టులు ఆడి 77 వికెట్లు తీశాడు ఇషాంత్ శర్మ.. అతని రికార్డు అద్భుతంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఇయాన్ చాపెల్.
undefined
2019 ఆసీస్ టూర్‌లో 21 వికెట్లు తీసిన నాథన్ లియాన్, 2020-21 ఆసీస్ టూర్‌లో కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఇదే సమయంలో మూడు మ్యాచులు ఆడిన అశ్విన్ 12 వికెట్లు తీశాడు.
undefined
నాథన్ లియాన్ 100 టెస్టుల్లో 399 వికెట్ల దగ్గర ఆగిపోయా, రవిచంద్రన్ అశ్విన్ 78 టెస్టుల్లో 409 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సెంచరీలతో 2600+ పరుగులు కూడా ఉన్నాయి.
undefined
click me!