అక్కడేదో అద్భుత శక్తి ఉంది, అది నన్ను ఎంచుకుంది... భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...

First Published Jun 6, 2021, 2:56 PM IST

భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అంతర్జాతీయ క్రికెట్‌లో 700లకు పైగా వికెట్లు పడగొట్టాడు. ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ, భజ్జీకి టీమిండియాలో చోటు కరువైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మైదానాల్లో మంచి రికార్డులు క్రియేట్ చేసిన హర్భజన్‌కి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌తో మాత్రం ప్రత్యేకమైన అనుబంధం ఉందట.

ఈడెన్ గార్డెన్స్‌లో ఏడు మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 21.76 సగటుతో 46 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు సార్లు ఐదేసి వికెట్లు ప్రదర్శన ఇవ్వగా, ఓ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.
undefined
2001లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ తీసిన హర్భజన్ సింగ్, టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న భజ్జీ, ఈడెన్ గార్డెన్స్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు.
undefined
‘ఆ మైదానంలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని నేను నమ్ముతాను. నేను ఈడెన్ గార్డెన్స్‌లో ఎప్పుడు మ్యాచులు ఆడినా, ఆ శక్తి నాలో ప్రవహిస్తుంది. కోల్‌కత్తాలో రాణించడం అంత ఈజీ కాదు...
undefined
ఈడెన్ గార్డెన్స్‌ కేవలం కొద్దిమందిని మాత్రం సెలక్ట్ చేసుకుంటుంది. అందులో నేను కోల్‌కత్తా ముద్దుబిడ్డను. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ తరుపున హ్యాట్రిక్ తీయడం ఎప్పటికీ మరిచిపోలేను. అది నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్.
undefined
2004లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 87 పరుగులిచ్చి 7 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, ఇదే మైదానంలో తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదుచేసుకున్నాడు. 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసి ఆస్ట్రేలియాపై ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్భజన్ సింగ్ మూడు మ్యాచుల్లో పాల్గొన్నాడు. మొదటి మ్యాచ్‌లో భజ్జీతో మొదటి ఓవర్ వేయించిన ఇయాన్ మోర్గాన్, ఆ తర్వాత అతనికి బంతి ఇవ్వలేదు. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు హర్భజన్ సింగ్.
undefined
ఇంతకుముందు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐపీఎల్ టైటిల్స్‌ను ఎక్కువ సార్లు గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న హర్భజన్ సింగ్, ప్రస్తుతం కేకేఆర్ టీమ్‌లో ఉన్నాడు. ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవగా, చెన్నై మూడుసార్లు, ఆ తర్వాతి స్థానంలో ఉన్న కేకేఆర్ రెండుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.
undefined
40 ఏళ్ల హర్భజన్ సింగ్, టీమిండియా తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచులు ఆడాడు. అయితే 2015లో భారత జట్టు తరుపున ఆఖరిగా మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, ఆరేళ్లుగా జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
undefined
ప్రస్తుతం తమిళ్‌లో ‘ఫ్రెండ్‌షిప్’ అనే మూవీలో నటిస్తున్నాడు హర్భజన్ సింగ్. ఈ సినిమాలో యాక్షన్ సింగ్ అర్జున్ కీ రోల్ పోషిస్తుండగా భజ్జీ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తోంది.
undefined
click me!