వీరూ నీ దాంట్లో సగం నాకివ్వు చాలు... వీరేంద్ర సెహ్వాగ్‌ను కోరిన సురేశ్ రైనా... ఆ మ్యాచ్‌లో...

Published : Jun 06, 2021, 01:44 PM IST

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠభరిత మ్యాచులకు కేరాఫ్ అడ్రెస్. భారీ హిట్టర్లు సమృద్ధిగా ఉన్న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే అది మరింత ఉత్కంఠభరితంగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య అలాంటి మ్యాచ్ చూసే అవకాశం రాకపోయినా 2014 క్వాలిఫైయర్ 2 మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు.

PREV
110
వీరూ నీ దాంట్లో సగం నాకివ్వు చాలు... వీరేంద్ర సెహ్వాగ్‌ను కోరిన సురేశ్ రైనా... ఆ మ్యాచ్‌లో...

2014 ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (అప్పట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన మ్యాచ్ అది...

210

‘వీరూ భాయ్ సిక్సర్లు కొడుతుంటే అలా చూస్తుండిపోయా. పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోందని అర్థమైంది. మహా అయితే 180-190 మధ్య స్కోరు చేస్తారని భావించా. అయితే వాళ్లు 230 దాకా కొట్టేశారు...

310

ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంత భారీ స్కోరు చేధించడం కష్టమని, ఓడిపోయినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే నా మైండ్‌లో మాత్రం ఆలోచన వేరేగా ఉంది.

410

నేను ఆ మ్యాచ్‌లో స్లిప్, పాయింట్‌, కవర్స్, మిడాఫ్, మిడాన్ స్థానాల్లో ఫీల్డింగ్ చేశా. వీరూ భాయ్ తనకి వచ్చిన ప్రతీ బంతిని నేరుగా కొట్టడం గమనించా. సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ నుంచి నా బ్యాటు ఫ్లో ఎలా ఉండాలో నేర్చుకున్నాను...

510

బౌలర్ల వేసే బంతిని రివర్స్ స్వీప్ ఆడడం కంటే స్ట్రైయిక్ బౌండరీలు బాదాలని మైండ్‌లో ఫిక్స్ అయిపోయా. క్రీజులోకి వెళ్లిన తర్వాత మొదటి బంతికే సిక్సర్ బాదా. డ్రెస్సింగ్ రూమ్‌లో నిండిన నిశ్శబ్ధం నాలో నమ్మకం పెంచింది. గెలిపించగలననే ధైర్యాన్ని నింపింది.

610

నేనే చేయగలనో దాన్నే నమ్మాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న అందరూ ఓడిపోతామని భావించినా నేను, ధోనీ మాత్రం మేం గెలవగలమని నమ్మాం. పిచ్ బ్యాటింగ్‌కి బాగా సహకరిస్తోంది. ప్రతీ బంతి బ్యాటు మీదకి చక్కగా వస్తోంది...

710

నేను మొదట రెండు బౌండరీలు కొట్టిన తర్వాత ఈ మ్యాచ్‌ను గెలపించగలనని పూర్తి నమ్మకం కలిగింది. వీరూ భాయ్ ప్రతీ బౌలర్ బౌలింగ్‌లో ఇరగదీశాడు. ఆశీష్ నెహ్రా, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ... ఎవ్వరినీ వదల్లేదు.

810

వీరూ బ్యాటింగ్‌లో ఎక్కడా అలసట కనిపించలేదు. తన ఇన్నింగ్స్‌లో ఎనిమిదో, తొమ్మిదో సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్ చేసేటప్పుడు పాట పాడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. అప్పుడే వీరూతో ‘నువ్వు చేసినదాంట్లో సగం నాకివ్వు. నా జట్టు కోసం ఈ మ్యాచ్ గెలవాలనుకుంటున్నా’ అని అన్నాను...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా.

910

2014 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 226 పరుగల భారీ స్కోరు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 122 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. 

1010

లక్ష్యచేధనలో సురేశ్ రైనా 25 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసి రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతో సీఎస్‌కే 202 పరుగులకి పరిమితమైంది.

click me!

Recommended Stories