సిక్సర్లు, బౌండరీలే కాదు! విరాట్‌ కోహ్లీని చూసి ఆ విషయం తెలుసుకోండి... ఇయాన్ బిషప్ కామెంట్..

First Published | Jul 21, 2023, 11:02 PM IST

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్, ఇప్పుడు దారుణమైన స్థితికి దిగజారింది. టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ మీద మోజుతో టెస్టులను, వన్డేలను పట్టించుకోని వెస్టిండీస్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కూడా అర్హత సాధించలేకపోయింది.. విరాట్ కోహ్లీని చూసి విండీస్ క్రికెటర్లు పాఠాలు నేర్చుకోవాలని అంటున్నాడు వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బిషప్.. 

Virat Kohli

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఓడిన భారత జట్టు, అసలే వరల్డ్ కప్‌కి అర్హత సాధించలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న వెస్టిండీస్‌ని ఆటాడుకుంటోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన టీమిండియా, రెండో టెస్టులోనూ గణాంకాలను మెరుగుచేసుకునే పనిలో పడింది..

Virat Kohli 500th Match

తొలి టెస్టులో సెంచరీ చేసి, విదేశాల్లో రెండో టెస్టు సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ, రెండో టెస్టులో 80 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఐదేళ్లుగా విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో 121 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..


Virat Kohli

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు మాత్రమే ఉండగా మెజారిటీ పరుగులు సింగిల్స్, డబుల్స్ ద్వారానే వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్..

‘విరాట్ ఇన్నింగ్స్‌ నిజంగా సూపర్బ్. అతను ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇది టెస్టు మ్యాచ్. ఇప్పుడు యువతరం, టీ20ల వెంటబడుతోంది. వన్డే, వైట్ బాల్ క్రికెట్‌పైన మోజుతో బౌండరీలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నారు. ఇదిగో 500 అంతర్జాతీయ మ్యాచులు ఇతను, టెస్టు మ్యాచ్‌లో ప్రతీ పరుగు కోసం ఎంతో కష్టపడుతున్నాడు..
 

ప్రతీ పరుగు ఎంత విలువైనదో అతనికి బాగా తెలుసు. ఒక్క పరుగు కోసం గీత దాటడం కోసం డైవ్ చేస్తున్నాడు... కరేబియన్‌లో ఉన్న ప్రతీ యంగ్ బ్యాటర్... పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు... విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి ఎంతో నేర్చుకోవాలి..
 

బౌండరీలే కొడతాను. సింగిల్స్ తీయడం వల్ల ఏమొస్తుంది, రెండు పరుగులు తీసేకంటే సిక్సర్లు కొట్టేయొచ్చు అనుకునేవాళ్లు, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నుంచి గుణపాఠం నేర్చుకోండి. ఓ సుదీర్ఘ ఇన్నింగ్స్ చేయడానికి కావాల్సింది పట్టుదల..
 

వచ్చే ఏ పరుగును వదులుకోకూడదనే కసి. చాలామంది బ్యాటర్లు డైవ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ 15 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఇంకా అలాగే డైవ్ చేస్తున్నాడు.

పరుగులు రాబట్టడం అంటే అతనికి అంత ఇష్టం. వికెట్ కాపాడుకోవడానికి అతను ఏమైనా చేస్తాడు, ఎందుకంటే తన టీమ్‌కి తన వికెట్ ఎంత అవసరమో కోహ్లీకి బాగా తెలుసు..’ అంటూ కామెంట్ చేశాడు

Latest Videos

click me!