ఆసియా క్రీడలకు ముందే ఐర్లాండ్ టూర్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్... హర్ధిక్ పాండ్యాకి రెస్ట్!

Chinthakindhi Ramu | Published : Jul 21, 2023 7:40 PM
Google News Follow Us

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత సిరీస్‌కో కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడింది టీమిండియా. గత ఏడాది ఏకంగా ఏడుగురు కెప్టెన్లు, టీమిండియాని నడిపించగా ఈ ఏడాది కూడా కొత్త కెప్టెన్లు పుట్టుకొస్తున్నారు..
 

16
ఆసియా క్రీడలకు ముందే ఐర్లాండ్ టూర్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్... హర్ధిక్ పాండ్యాకి రెస్ట్!


ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి కెప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ, ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కి కూడా సారథ్యం వహించబోతున్నాడు. వన్డే సిరీస్ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..

26
Image credit: PTI

చైనాలో జరిగే ఆసియా క్రీడలకు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ టోర్నీల్లో మహారాష్ట్రకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కి ఇది చాలా పెద్ద ఊహించని ప్రమోషన్..

36

వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత అటు నుంచి ఐర్లాండ్‌కి వెళ్లబోతోంది భారత జట్టు. ఆసియా కప్ 2023 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఐర్లాండ్ టూర్‌ నుంచి హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట టీమిండియా మేనేజ్‌మెంట్..

Related Articles

46

దీంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ఐర్లాండ్‌లో మూడు టీ20 మ్యాచులు ఆడే భారత జట్టు, ఆ తర్వాత ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొంటుంది..

56

ఆసియా కప్ టోర్నీలో ఆగస్టు 31న మొదలై, సెప్టెంబర్ 17న ముగుస్తుంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 28 నుంచి ఆరంభమై అక్టోబర్ 8న ముగుస్తాయి. కాబట్టి  ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టునే, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడించే అవకాశం ఉంది..

66

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత నెల రోజుల విశ్రాంతి దొరుకుతుంది. ఈ టైమ్‌లో చైనాకి వెళ్లి అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు రుతురాజ్ గైక్వాడ్ అండ్ టీమ్‌కి కావాల్సినంత సమయం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోందట..

Recommended Photos