పంత్ కు సారథ్యమా..? నేనైతే మరోమాట లేకుండా పక్కనపెట్టేసేవాడిని.. మాజీ చీఫ్ సెలక్టర్ కామెంట్స్

First Published Jun 22, 2022, 12:12 PM IST

Rishabh Pant: సీనియర్ల గైర్హాజరీలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో రిషభ్ పంత్ కు టీమిండియా నాయకత్వ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోగా.. స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న కెఎల్ రాహుల్ కు గాయం కావడంతో  టీమ్ మేనెజ్మెంట్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అయితే అతడి సారథ్యంలో భారత  జట్టు తొలి రెండు మ్యాచులలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. 

కానీ తర్వాత  వైజాగ్, రాజ్కోట్ లలో జరిగిన మ్యాచ్ లలో పుంజుకుని సిరీస్ ను డ్రా చేసింది. ఇక చివరిదైన బెంగళూరు టీ20 వర్షార్పణం కావడంతో సిరీస్ ను 2-2 తో ఇరు జట్లు పంచుకున్నాయి. అయితే సిరీస్ ఫలితమెలా ఉన్నా  రిషభ్ పంత్ సారథ్యంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. అతడు కెప్టెన్ గా విఫలమయ్యాడని  క్రికెట్ పండితులు కామెంట్ చేశారు. 

Madan Lal

ఇప్పుడు ఈ జాబితాలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ మదన్ లాల్ కూడా చేరాడు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. ‘నేనైతేే పంత్ కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పేవాడిని కాను. అందుకు ఏమాత్రం అంగీకరించకపోయేవాడిని. టీమిండియా కెప్టెన్సీ అనేది చిన్న విషయం కాదు. ఇంత పెద్ధ బాధ్యతలు ఇంకా అనుభవం లేని కుర్రాడికి ఇవ్వడం కరెక్ట్ కాదు..  

పంత్ ఇంకా టీమిండియాకు కెప్టెన్ అయ్యే అనుభవం సంపాదించుకోలేదు. మరో రెండేండ్లు అతడు వివిధ దేశాల్లో  సిరీస్ లు ఆడి బాగా రాణించిన తర్వాత అతడికి కెప్టెన్సీ అప్పజెప్పాలి. అప్పుడు అతడికి మెచ్యూరిటీ వస్తుంది. ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది.. 

ఎంఎస్ ధోనిని చూడండి. అతడు చాలా కూల్ కెప్టెన్. ఎలాంటి పరిస్థితులనైనా  హ్యాండిల్ చేయగల సత్తా అతడికుంది. అందుకే అతడు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి బ్రిలియంట్ బ్యాటర్. దూకుడే మంత్రంగా భారత జట్టుకు విజయాలు అందించాడు. నా అభిప్రాయం పంత్ బ్యాటింగ్ చేయడని కాదు. కానీ అతడింకా అనుభవం సంపాదించుకోవాలి...’ అని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. 

Image credit: PTI

కాగా ఈ సిరీస్ లో పంత్ నాయకుడిగా అత్తెసరు మార్కులతో పాస్ కాగా బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు.  ఈ సిరీస్ లో అతడు.. 1, 17, 6, 5, 29 (మొత్తంగా 58) పరుగులు చేశాడు. కానీ దాదాపు నాలుగేండ్ల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్..మెరుగైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో వచ్చే టీ20 ప్రపంచకప్ కు పంత్, కార్తీక్ లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. 

click me!