షాకింగ్: విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్!?... ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ప్రాక్టీస్‌‌కి ఆటంకం...

First Published Jun 22, 2022, 11:08 AM IST

టీమిండియా ఫ్యాన్స్‌కి ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్తే. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వార్తలు వినిపిస్తున్నాయి... ఇప్పటికే భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే...

రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌ ఫ్లైట్ ఎక్కకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ సహా శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ వంటి టీమ్‌మేట్స్ కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నాడు...

అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడట. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న విరాట్, ప్రస్తుతం టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి...

Image credit: BCCI

అయితే విరాట్ కోహ్లీ మాత్రం తనకు కరోనా సోకినట్టు ఎక్కడా తెలియచేయలేదు. సోషల్ మీడియాలో జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్న ఫోటోలను షేర్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీకి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు నిజమేనా? లేక పుకార్లు మాత్రమేనా? అనేది తేలాల్సి ఉంది...

ఇంగ్లాండ్‌ టూర్‌లో మొదటి నాలుగు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, మొదటి రెండు టెస్టుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా తర్వాత రెండు టెస్టుల్లో బ్యాటుతో రాణించాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ, టీమ్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. టీమ్ మేట్స్‌పై చేతులు వేసుకుని మరీ ఫోజులు ఇచ్చాడు. దీంతో టీమిండియా బృందంలో కరోనా కలవరం మొదలైందని, లంకాషైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కి కీ ప్లేయర్లు దూరంగా ఉండబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి లంకాషైర్‌లో కొందరు టీమిండియా అభిమానులు సెల్ఫీలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు విరాట్, రోహిత్...
 

click me!