ఆ విషయంలో కోహ్లీ కంటే నేనే బెస్ట్... విరాట్‌ ఎప్పుడూ నా చేతిలో ఓడిపోతూ ఉంటాడు... - శుబ్‌మన్ గిల్

First Published May 13, 2021, 1:30 PM IST

ఆసీస్ టూర్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్... అద్భుతంగా ఆకట్టుకున్నాడు. గబ్బా టెస్టులో శుబ్‌మన్ గిల్ చేసిన 91 పరుగులు, టీమిండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాయి. శుబ్‌మన్ గిల్ తాజాగా ఓ విషయంలో కోహ్లీ కంటే తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు...

ఆసీస్ టూర్‌లో శుబ్‌మన్ గిల్ ఆడిన క్లాస్ బ్యాటింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టూర్ తర్వాత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు శుబ్‌మన్ గిల్. స్వదేశంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన గిల్, ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
undefined
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు ముచ్చటించిన శుబ్‌మన్ గిల్, వాళ్లు అడిగిన ప్రశ్నలకు కొన్ని ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు.
undefined
విరాట్ కోహ్లీ నేర్పించే అవకాశం వస్తే, ఏం నేర్పిస్తారు అని అడిగిన ప్రశ్నకు... ‘ది ఫిఫా వీడియో గేమ్... ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎప్పుడూ అందులో నా చేతుల్లో ఓడిపోతూ ఉంటాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు.
undefined
వచ్చే పుట్టినరోజుకి తన తండ్రికి టీ20 వరల్డ్‌కప్‌ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పిన శుబ్‌మన్ గిల్... తనకి ఫుల్ షాట్ ఆడడం అంటే చాలా ఇష్టమని చెప్పాడు...
undefined
టీ20 వరల్డ్‌కప్ ఆడడం కంటే వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోయే జట్టులో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పిన శుబ్‌మన్ గిల్, తనకి వచ్చిన ఈ అవకాశానికి న్యాయం చేయగలననే నమ్మకం ఉందని అన్నాడు...
undefined
అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన పృథ్వీషాకి బదులుగా ఘోరంగా ఫెయిల్ అయిన శుబ్‌మన్ గిల్‌కి ఇంగ్లాండ్ టూర్‌లో అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
undefined
శివమ్ మావి బౌలింగ్‌లో వరుసగా ఆరుకి ఆరు ఫోర్లు బాదిన పృథ్వీషా కంటే ఐపీఎల్‌లో బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడుతూ టెస్టులు ఆడిన గిల్‌ ఎందులో బెటర్ అంటూ సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు.
undefined
click me!