దిగ్గజాల సరసన ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్.. కపిల్ దేవ్ రికార్డుకు అత్యంత చేరువలో..

Published : Mar 18, 2022, 10:22 AM IST

Ben Stokes Equals Kapil Dev: ఆధునిక టెస్టు క్రికెట్ చరిత్రలో ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన ఇంగ్లాండ్  స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుకు అత్యంత చేరువలోకి వచ్చాడు.

PREV
16
దిగ్గజాల సరసన ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్.. కపిల్ దేవ్ రికార్డుకు అత్యంత చేరువలో..

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టెస్టు క్రికెట్ లో అరుదైన ఘనతను సాధించాడు.  వెస్టిండీస్ తో  ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఆడుతున్న సందర్భంగా సెంచరీ చేసిన అతడు ఈ ఘనతను అందుకున్నాడు. 

26

విండీస్ తో రెండో టెస్టులో సెంచరీ చేసిన అతడు టెస్టులలో 5 వేల పరుగులు, 100 వికెట్లు సాధించిన  ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్ గా అతడు చరిత్రలో నిలిచాడు. 

36

5 వేల టెస్టు పరుగులు, 100 వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో గ్యారీ సోబర్స్ (93 టెస్టులు.. 8032 పరుగులు.. 235 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో.. ఇయాన్ బోథమ్ (102 టెస్టులు.. 5,200 పరుగులు.. 383 వికెట్లు..), కపిల్ దేవ్ (131 టెస్టులు.. 5,248 పరుగులు.. 434 వికెట్లు) ఉన్నాయి

46

జాక్వస్ కలిస్ (166 టెస్టులు.. 13,289 పరుగులు.. 292 వికెట్లు) తర్వాత  ఈ రికార్డు సాధించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (78 టెస్టులు.. 5,021 పరుగులు.. 170 వికెట్లు) ఉన్నాడు. మరో 228 పరుగులు చేస్తే స్టోక్స్.. పరుగులలో కపిల్ దేవ్ రికార్డును అధిగమిస్తాడు.

56

ఇదిలాఉండగా.. విండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది.  ఇంగ్లాండ్  తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 507 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (153),  బెన్ స్టోక్స్ (120) లు సెంచరీలతో కదం తొక్కారు. లారెన్స్ (93) తృటిలో సెంచరీ కోల్పోయాడు. 

66

రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 1 వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రాత్ వైట్ (28 బ్యాటింగ్), షమ్రా బ్రూక్స్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

click me!

Recommended Stories