మొట్టమొదటి టీ2 వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి, టైటిల్ సాధించింది టీమిండియా. 38 ఆఖర్లో సిక్సర్లతో టీమిండియా శిబిరాన్ని టెన్షన్ పెట్టిన మిస్బా వుల్ హక్, ఆఖరి ఓవర్‌లో ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు...
ఉమర్ గుల్‌ను ఆర్‌పీ సింగ్ అవుట్ చేయడంతో 141 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. విజయానికి ఇంకా 17 పరుగులు కావాలి. 19వ ఓవర్ ఆఖరి బంతికి మహ్మద్ ఆసిఫ్ ఫోర్ బాదాడు...
212
ఆఖరి ఓవర్‌లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో జోగిందర్ శర్మకు బాల్ అందించాడు ఎమ్మెస్ ధోనీ. అప్పటికే జోగిందర్ శర్మ మొదటి 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. మొదటి బంతికి వైడ్ రూపంలో ఓ పరుగు వచ్చింది.
312
తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి సిక్సర్ బాదిన మిస్బా వుల్ హక్, లక్ష్యాన్ని తగ్గించేశాడు. చివరి 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. ఈ దశలో స్కూప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, శ్రీశాంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మిస్బా వుల్ హక్...
412
దీంతో 38 బంతుల్లో 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన మిస్బా వుల్ హక్ ఇన్నింగ్స్‌కి, పాకిస్తాన్ టైటిల్ ఆశలకు తెరపడినట్టైంది. ఈ మ్యాచ్ గురించి 14 ఏళ్ల తర్వాత స్పందించాడు మిస్బా వుల్ హక్...
512
‘2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్కూప్ షాట్స్ ఆడుతూ చాలా ఫోర్లు బాదాను. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫైన్ లెగ్ ప్లేస్‌లో కూడా పరుగులు రాబట్టగలిగాను...
612
స్పిన్ బౌలింగ్‌లో కూడా నేను ఈజీగా స్కూప్ షాట్ ఆడగలను. నిజం చెప్పాలంటే నేను ఆ షాట్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఆడాను. మరీ ముఖ్యంగా మిస్ టైమ్ కావడంతో అవుట్ అయ్యాను...
712
2011లో మొహాలీ పిచ్‌లో భారత్ జట్టు తొలి 4 ఓవర్లలో 39 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత బంతి రివర్స్ కావడం మొదలుకావడంతో అతికష్టం మీద పరుగులు వచ్చాయి...
812
సచిన్ టెండూల్కర్ ఒక్కడే 85 పరుగులు చసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించగలిగాడు. మేం కూడా మొదటి 15 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 80 పరుగులు చేయగలిగాం..
912
ఆ తర్వాతే పరుగులు రావడం కష్టమైపోయింది. కొన్ని ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయాం. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఫాస్ట్ బౌలర్లు కలిసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు... సింగిల్స్ రావడం కూడా కష్టమైపోయింది...
1012
చివరి 10 ఓవర్లలో 100 పరుగులు కావాల్సి వచ్చింది. బ్యాటింగ్ పవర్ ప్లే 5 ఓవర్లు ఉన్నాయి. చేతిలో వికెట్లు ఉన్నాయి. ఈజీగా గెలుస్తామని అనుకున్నాం. నేను ఆఖరి దాకా ఉంటే మ్యాచ్‌ని గెలిపించవచ్చని అనుకున్నాం...
1112
అయితే నాకు ఐదు ఓవర్లలో రెండు ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ వచ్చింది. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో పరుగులు రాలేదు. 22 పరుగుల తేడాతో ఓడిపోయాం...’ అంటూ వివరించాడు పాక్ మాజీ క్రికెటర్, కెప్టెన్ మిస్బా వుల్ హక్...
1212
ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆసియా లయన్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు మిస్బా వుల్ హక్. వరల్డ్ జెయింట్స్‌తో ఆసియా లయన్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది...