వార్నర్ భాయ్‌కి ఈసారి కెప్టెన్సీ కష్టమే... మెగా వేలంలో ధర దక్కించుకున్నా కెప్టెన్‌గా మాత్రం...

First Published Jan 29, 2022, 1:44 PM IST

ఐపీఎల్ కెరీర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, మరో రెండు సీజన్లలో జట్టును ఫ్లేఆఫ్స్‌కి చేర్చాడు... అయితే ఒకే ఒక్క బ్యాడ్ సీజన్, వార్నర్ భాయ్ కెరీర్‌ను తలకిందులు చేసేసింది...

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా కెప్టెన్సీ నుంచి తొలగించబడ్డాడు డేవిడ్ వార్నర్... ఆరింట్లో ఒకే ఒక్క విజయం అందుకోవడం కూడా వార్నర్ కెప్టెన్సీ పోవడానికి కారణమైంది...

గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్, రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్సీ కోల్పోయి, తుదిజట్టులో చోటు కూడా కోల్పోయిన డేవిడ్ వార్నర్‌కి ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో కూడా చోటు దక్కని విషయం తెలిసిందే...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీలో భాగంగా కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా అబ్దుల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మిగిలిన అందరికీ వేలానికి విడుదల చేసింది...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌ పాలసీలో భాగంగా కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మిగిలిన అందరికీ వేలానికి విడుదల చేసింది...

‘నా అంచనా ప్రకారం డేవిడ్ వార్నర్ ఏ జట్టులోకి వెళ్లినా, అతనికి కెప్టెన్సీ దక్కడం అనుమానమే. పంజాబ్ కింగ్స్ జట్టు మయాంక్ అగర్వాల్‌ను రిటైన్ చేసుకుంది. అంటే మరే ప్లేయర్ దొరకకపోతే అతనికే కెప్టెన్సీ దక్కొచ్చు...

ఆ జట్టును తీసి వేసినా ఇంకా రెండు జట్లకి కెప్టెన్లు కావాలి... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి డేవిడ్ వార్నర్ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్లు కావాలనుకున్న ప్లేయర్‌ కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా రెఢీగా ఉంటారు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టీమ్‌కి కూడా కెప్టెన్ కావాలి. కచ్ఛితంగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌కి భారీగా ధర దక్కొచ్చు. అయితే అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి ఈ రెండు జట్లు రెఢీగా ఉంటాయా?

ఐపీఎల్ అనేది కూడా ఓ కుటుంబం లాంటిదే. గత ఏడాది ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ కోల్పోవడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు...

ఆర్‌సీబీకి వెళితే డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తారు. అయితే గత ఏడాది అనుభవాల దృష్ట్యా వార్నర్ భాయ్‌ని కెప్టెన్‌గా చేయడానికి మాత్రం ఫ్రాంఛైజీలు ఆలోచిస్తాయి...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

click me!