Published : Jun 21, 2022, 02:28 PM ISTUpdated : Jun 21, 2022, 02:34 PM IST
Shahid Afidi: గతంలో భారత క్రికెట్ తో పాటు ఐపీఎల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి ఐపీఎల్ మీడియా హక్కుల ధర చూసి జ్ఞానోదయం అయినట్టుంది.
భారత క్రికెట్ పై గతంలో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో ట్రోల్స్ కు గురైన పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి జ్ఞానోదయం అయినట్టుంది. తాజాగా ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా వచ్చిన డబ్బులను చూసి మైండ్ బ్లాక్ అయిందో ఏమో గానీ.. తాజాగా అతడు ఈ లీగ్ తో పాటు భారత క్రికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
27
వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ను రెండున్నర నెలలు ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నది. అందుకు అనుగుణంగానే ఐసీసీ.. ఫ్యూచర్స్ టూర్స్ ప్రోగ్రామ్ లో మార్పుల కోసం ప్రయత్నాలు జరుపుతున్నది. అయితే ఇలా చేయడం పాకిస్తాన్ క్రికెట్ కు ప్రమాదకరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అఫ్రిది స్పందించాడు.
37
అఫ్రిది మాట్లాడుతూ.. ‘ఇప్పుడు క్రికెట్ అంటే అంతా మార్కెట్, ఎకానమీకి సంబంధించిన విషయం. భారత్ లో క్రికెట్ కు మార్కెట్ బాగా ఉంది. వాళ్లు ఏం చెప్పారో (ఐపీఎల్ రెండున్నర నెలల గురించి) అది కచ్చితంగా జరిగి తీరుతుంది. వాళ్లకు అంత సామర్థ్యం కూడా ఉంది..’అని వ్యాఖ్యానించాడు.
47
Image credit: PTI
ఐపీఎల్ ను ఎక్కువ రోజులు ఆడించడం వల్ల పాకిస్తాన్ క్రికెట్ పై తప్పకుండా ప్రభావం పడుతుందని అఫ్రిది వెల్లడించాడు. అయితే ఈ విషయంలో తాము ఏమీ చేసేది లేదని అఫ్రిది మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
57
ఐపీఎల్-15 ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేదాకా పాక్ ఆటగాళ్లు ఖాళీగానే ఉన్నారు. ఇక రాబోయే కాలంలో ఐపీఎల్ దాదాపు మూడు నెలల పాటు సాగనుండటంతో పీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలా చేస్తే ద్వైపాక్షిక సిరీస్ లకు భంగం కలిగినట్టే అని కొత్త రాగం అందుకుంది.
67
ఇక ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత సుమారు రెండు నెలల పాటు పాకిస్తాన్ ఆటగాళ్లు ఖాళీగానే ఉన్నారు. పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా తో పాటు ఇంగ్లాండ్ కు చెందిన ఆటగాళ్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉండటంతో మిగిలిన జట్లేవీ పాకిస్తాన్ తో ఆడటానికి ఆసక్తి చూపలేదు.
77
ఐపీఎల్-15 ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేదాకా పాక్ ఆటగాళ్లు ఖాళీగానే ఉన్నారు. ఇక రాబోయే కాలంలో ఐపీఎల్ దాదాపు మూడు నెలల పాటు సాగనుండటంతో పీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలా చేస్తే ద్వైపాక్షిక సిరీస్ లకు భంగం కలిగినట్టే అని కొత్త రాగం అందుకుంది.