అక్కడ చాలా మంది కర్చీప్ లు పట్టుకుని రెడీగా ఉన్నారు.. నీకు చోటు లేదు : రుతురాజ్ కు మాజీ క్రికెటర్ సూచన

Published : Jun 21, 2022, 03:04 PM IST

Ruturaj Gaikwad: ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. 2021 సీజన్ లో అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్న అతడికి ఆనతికాలంలోనే జాతీయ జట్టులో చోటు దక్కింది. 

PREV
17
అక్కడ చాలా మంది కర్చీప్ లు పట్టుకుని రెడీగా ఉన్నారు.. నీకు చోటు లేదు : రుతురాజ్ కు మాజీ క్రికెటర్ సూచన

వచ్చే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఎవరెవరు ఆడతారు..? తుది జట్టులో ఎవరుంటారు..? ఎవరికి అవకాశాలు దక్కుతాయి..? ఎవరికి దక్కవు..? అనే విషయం మీద  ఇప్పట్నుంచే చర్చ జరుగుతున్నది. 

27
Image credit: PTI

ఇప్పటికే టీమిండియాలో వికెట్ కీపర్ల విషయంలో తీవ్ర పోటీ ఉన్నది. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లతో పాటు సంజూ శాంసన్ కూడా రేసులో ఉన్నాడు.  వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పుడు ఓపెనర్ల విషయంలో కూడా దాదాపు ఇదే సందిగ్ధత నెలకొంది. 

37

ఇటీవలే దక్షిణాఫ్రికా సిరీస్ లో సీనియర్ల గైర్హాజరీలో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లు ఓపెనింగ్ చేశారు.  కానీ ఈ ఇద్దరిలో ఇషాన్ సక్సెస్ కాగా  రుతురాజ్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఒక్క వైజాగ్ లో చేసిన హాఫ్ సెంచరీ తప్ప అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

47
Image credit: PTI

ఈ వైఫల్యంతో టీ20 ప్రపంచకప్ కు కూడా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యే అవకాశాలు లేవని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇప్పటికే అక్కడ చాలా ట్రాఫిక్ ఉందని.. వాళ్లందరినీ దాటుకుని జట్టులో ఓపెనర్ గా చోటు దక్కించుకునే అవకాశం గైక్వాడ్ కు లేదని చెప్పాడు. 
 

57
akash chopra

తన యూట్యూబ్ ఛానెల్ లో చోప్రా మాట్లాడుతూ.. ‘టీమిండియాలో ఓపెనింగ్ ప్లేస్ కు చాలా ట్రాఫిక్ ఉంది. దానిని మనం ఢిల్లీలోని చాందినీ చౌక్ లో అయ్యే ట్రాఫిక్ తో పోల్చినా తప్పులేదు.  వాస్తవంగా కూడా అక్కడ అంత క్రౌడ్ ఉంది. 

67

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ తో పాటు విరాట్ కోహ్లి కి కూడా ఓపెనింగ్ చేసే సత్తా ఉంది. గతంలో రిషభ్ పంత్ కూడా ఓ మ్యాచ్ లో ఓపెనింగ్ చేశాడు. జట్టు అవసరాల నిమిత్తం అతడు మళ్లీ  ఓపెనర్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

77

ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ కు ఓపెనర్ గానే గాక జట్టులో కూడా చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా సిరీస్ లో అతడు తనకు వచ్చిన అవకాశాలను చేజేతులా పాడుచేసుకున్నాడు..’ అని తెలిపాడు.దక్షిణాఫ్రికా సిరీస్ లో ఐదు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన గైక్వాడ్.. 96 పరుగులే చేశాడు. వైజాగ్ టీ20లో 57 పరుగులు తప్ప మిగిలిన నాలుగు ఇన్నింగ్స్ లలో అతడు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. అంతకుముందు ఐపీఎల్-15 లో కూడా గైక్వాడ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories