వసీం అక్రమ్ ఎందుకు ఆడలేదు? అనే విషయం గురించి కానీ అతనికి గాయమైందా? లేక అనారోగ్యానికి గురయ్యాడా? అనే విషయం గురించి కానీ పాక్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదు. మ్యాచ్ ఆరంభానికి ముందు వసీం అక్రమ్ ఆడడం లేదని చెప్పడంతో కెప్టెన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడడం వల్లే క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌కి దూరమయ్యాడని వార్తలు వినిపించాయి.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు 39 పరుగుల తేడాతో విజయం అందుకుని సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. నవ్‌జోత్ సిద్ధూ 93 పరుగులు, సచిన్ టెండూల్కర్ 31, అజయ్ జడేజా 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 22 పరుగులు ఇచ్చారు.టీమిండియా 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా పాక్ 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులు మాత్రమే చేయగలిగింది...
ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ వసీం అక్రమ్ ఉండి ఉంటే, పాకిస్తాన్ ఈజీగా సెమీస్ చేరేందనే అభిప్రాయం పాక్ అభిమానులు వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగి 26 ఏళ్లు గడుస్తున్నా వసీం అక్రమ్‌కి ఈ మ్యాచ్ గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సమయంలోనూ వసీం అక్రమ్‌కి ఇదే ప్రశ్నమైన ఎదురైంది...
‘1996 వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఎందుకు ఆడలేదో చెప్పాలంటూ’ ఓ పాక్ అభిమాని, వసీం అక్రమ్‌ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు వసీం అక్రమ్... ‘ఈ ప్రశ్నకు ఇకనైనా సమాధానం చెప్పాలనుకుంటా....
ఈ తరంలో చాలామంది దీని గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు రూమర్లను నమ్మడం మానేస్తే మంచిది. అది జరిగినప్పుడు నువ్వు పుట్టి కూడా ఉండవు. అయినా ఇప్పటికీ ఏదోటి అనాలని దాడి చేస్తున్నారు. దానికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాకు గాయమైంది...
wasim akram 1992 world cup
ఆ మ్యాచ్‌లో నేను 34 పరుగులు చేశా. స్వీప్ షాట్ ఆడినప్పుడు నా పక్క కండరాలు పట్టేశాయి. దాని నుంచి కోలుకోవడానికి 6 వారాల సమయం పట్టింది. అందుకే ఆ మ్యాచ్ ఆడలేదు. అయితే క్వార్టర్ ఫైనల్‌కి ముందు కెప్టెన్‌కి గాయమైందంటే భారత జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది...
wasim akram 1992 world cup
కీలక ప్లేయర్ ఆడడం లేదని తెలిస్తే వాళ్లు మరింత జోష్‌గా ఆడతారు. అందుకే ఎవ్వరికీ ఈ విషయం చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు ఉదయం కూడా నాకు రెండు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఇచ్చారు. వకార్ యూనిస్ కూడా అది చూశాడు. అయినా వర్కవుట్ కాలేదు...
ఆ నొప్పితో ఆడి ఉంటే నన్ను ఇంకా ఎక్కువగా ట్రోల్ చేసేవాళ్లు, మరో ప్లేయర్ లేక ఇలా ఆడుతున్నావా? అంటూ తిట్టేవాళ్లు. నేను ఆడకపోవడం వల్లే టీమిండియాతో ఓడిపోయామనడంలో ఎలాంటి లాజిక్ ఉందో నాకు అర్థం కావడం లేదు. నేను ఆడలేని పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి ఆడలేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్...