బుమ్రాకు అతడే సరైన జోడి.. నేనే సెలెక్షన్ కమిటీలో ఉంటే వెంటనే సెలెక్ట్ చేస్తా: ఎస్ఆర్హెచ్ బౌలర్ పై భజ్జీ

Published : May 07, 2022, 01:09 PM IST

Harbhajan Singh Lauds Umran Malik: ఐపీఎల్ లో తన వేగంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. అతడు బుమ్రా కు సరియైన జోడి అని భజ్జీ ప్రశంసించాడు. 

PREV
17
బుమ్రాకు అతడే సరైన జోడి.. నేనే సెలెక్షన్ కమిటీలో ఉంటే వెంటనే సెలెక్ట్ చేస్తా: ఎస్ఆర్హెచ్ బౌలర్ పై భజ్జీ

తన బౌలింగ్ తో మ్యాచ్ మ్యాచ్ కు ఓ రికార్డు క్రియేట్ చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను వీలైనంత త్వరలో భారత జట్టు లోకి తీసుకోవాలని కోరుతున్న  వారి జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరాడు. 

27

తాజాగా భజ్జీ మాట్లాడుతూ.. ‘అతడు (ఉమ్రాన్ మాలిక్) నా ఫేవరేట్ బౌలర్. నేను అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాను. అతడి వేగం అద్భుతం. గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో విసిరిన ఏ బౌలర్ కూడా జాతీయ జట్టుకు ఆడకుండా లేడు. 

37

ఉమ్రాన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. చాలా మంది యువకులకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాడు. అతడు ఎక్కడ్నుంచి వచ్చి ఏం సాధిస్తున్నాడన్నది ఇక్కడ చాలా ప్రత్యేకం. 

47

రాబోయే రోజుల్లో అతడు  టీమిండియాకు ఆడతాడో లేదో నాకు తెలియదు గానీ నేనే గనక సెలెక్షన్ కమిటీలో ఉంటే మాత్రం మరో ఆలోచన లేకుండా అతడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తా.  గ్రౌండ్ లో నువ్వు దుమ్ము దులుపు అని కూడా అతడితో చెప్తా.  

57

వచ్చే అక్టోబర్ లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో  జస్ప్రీత్ బుమ్రాకు  అతడే సరైన జోడి..’ అని తెలిపాడు. ఉమ్రాన్  ను జట్టులోకి తీసుకోవడం విషయంలో అతడి వయసు చాలా చిన్నది. ఇప్పుడే ఎందుకు..? వేగం ఒక్కటే ఉంటే సరిపోతుందా..? అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో భజ్జీ వాటిపై కూడా స్పందించాడు. 

67

‘సచిన్ టెండూల్కర్  భారత జట్టుకు ఆడుతున్నప్పుడు అతడి వయసు 16 ఏండ్లు. నేను తొలి టెస్టు ఆడినప్పుడు నా వయసు పదిహేడున్నర సంవత్సరాలు.  ఆ సమయంలో వాళ్లను చిన్న పిల్లలుగా ట్రీట్ చేస్తే  వాళ్ల కెరీర్ నాశనమైనట్టే కదా. వారికి అవకాశమివ్వాలి.  ఆడనివ్వాలి.  

77

ఉమ్రాన్ వయసు (22 ఏండ్లు) గురించి మరిచిపోండి. ఒక ఆటగాడు అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఫిట్ గా ఉంటే అది చాలు. వాళ్లను జాతీయ జట్టులోనే కాదు ఎక్కడైనా ఆడించొచ్చు..’ అని భజ్జీ  చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో 10 మ్యాచులాడిన ఉమ్రాన్.. 15 వికెట్లు తీశాడు. అంతేగాక అత్యంత వేగవంతమైన డెలివరీ (157 కి.మీ) కూడా సంధించి కొత్త చరిత్ర సృష్టించాడు. 

click me!

Recommended Stories