ఒకవేళ అతడిలో ఉత్తమ ఆటను బయిటకు తీసుకురాకుంటే నేను కోచ్ గా ఫెయిలైనట్టే అనుకున్నా : రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Published : Dec 27, 2021, 05:57 PM IST

Ravi Shastri About Rohit Sharma: భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. 

PREV
18
ఒకవేళ అతడిలో ఉత్తమ ఆటను బయిటకు తీసుకురాకుంటే నేను కోచ్ గా ఫెయిలైనట్టే అనుకున్నా : రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవినుంచి వైదొలిగాక సంచలనాలను వేదికగా మారాడు. పలు ఇంటర్వ్యూలు, తన హయాంలో ఆటకు సంబంధించిన విషయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నాడు.

28

తాజాగా ఆయన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి రోహిత్ శర్మ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడిలో ఉత్తమ ఆటను బయటకు తీసుకురాకుంటే తాను కోచ్  గా ఫెయిలైనట్టే అని  అనుకున్నట్టు వ్యాఖ్యానించాడు. 

38

స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారమవుతున్న ‘బోల్డ్ అండ్ బ్రేవ్’ షో లో రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘రోహిత్ శర్మ  ప్రపంచంలోనే  అత్యుత్తమ బ్యాటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే టెస్టుల్లో అతడిని ఓపెనర్ గా పంపించాలనే విషయమై నాకు సందేహాలేమీ లేవు. 

48

అతడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టకుంటే నేను హెడ్ కోచ్ గా విఫలమైనట్టే అని భావించాను. ఎందుకంటే అతడు చాలా ప్రతిభావంతుడు.. నేను ఈ పనిని కచ్చితంగా చేయగలనని నా మైండ్ లో అనుకున్నాను...’ అని చెప్పాడు. 

58

అప్పటిదాకా టెస్టులలో వస్తూ పోతూ ఉన్న హిట్ మ్యాన్.. 2015 నుంచే తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.  అంతకుముందు రోహిత్ శర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. 

68

కానీ 2019లో  దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించినప్పుడు అతడు ఓపెనర్ గా క్రీజులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత జరిగిన సిరీస్ లలో కూడా రోహిత్.. టెస్టు ఓపెనర్ గా అవతారమెత్తాడు. 

78

ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో రాణించిన రోహిత్.. టెస్టులలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో టెస్టులలో 906 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్థ శతకాలున్నాయి. అత్యుత్తమ స్కోరు 161. 

88

గతంలో వన్డేలలో కూడా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు దాకా రోహిత్ ఏ స్థానంలో బ్యాటింగ్ వచ్చేవాడో అతడితో పాటు టీమ్ మేనేజ్మెంట్ కు కూడా ఓ క్లారిటీ లేకుండా ఉండేది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. శిఖర్ ధావన్ కు తోడుగా హిట్ మ్యాన్ ను పంపాడు. ఇక ఆ తర్వాత అంతా చరిత్రే. 

Read more Photos on
click me!

Recommended Stories