2011లో మిస్! ప్లేయర్‌‌గా , వైస్ కెప్టెన్‌గా, ఇప్పుడు కెప్టెన్‌గా... రోహిత్ శర్మ వరల్డ్ కప్ ప్రస్థానం...

Chinthakindhi Ramu | Published : Sep 6, 2023 5:21 PM
Google News Follow Us

ఎలా వచ్చామనేది కాదు, ఎలా వెళ్లామనేది అందరూ గుర్తుంచుకుంటారు. రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌కి ఇది పక్కాగా సెట్ అవుతుంది. ఎందుకంటే టీమిండియాలో కుదురుకోవడానికి ఐదేళ్లు తీసుకున్న రోహిత్ శర్మ, 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత కెప్టెన్సీ అందుకున్నాడు..

18
2011లో మిస్! ప్లేయర్‌‌గా , వైస్ కెప్టెన్‌గా, ఇప్పుడు కెప్టెన్‌గా... రోహిత్ శర్మ వరల్డ్ కప్ ప్రస్థానం...
Rohit Sharma-Babar Azam

2011 వన్డే వరల్డ్ కప్‌కి  నాలుగేళ్ల ముందే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు రోహిత్ శర్మ.. 2007 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగానూ ఉన్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో రోహిత్ వన్డే గణాంకాలు సరిగ్గా లేకపోవడంతో అతనికి 2011 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు..

28

రోహిత్ శర్మ వెనకాల వచ్చిన విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్‌గా ఆడిన రోహిత్ శర్మ, 8 మ్యాచుల్లో 47.14 సగటుతో 330 పరుగులు చేశాడు...

38

2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, 5 సెంచరీలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...

Related Articles

48
Rohit Sharma and Yuvraj Singh

2019 వరల్డ్ కప్ ఎడిషన్‌లో 648 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డుకి 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు..

58

ఈసారి 2023 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు రోహిత్ శర్మ. ఇప్పటికే రోహిత్ వయసు 36 ఏళ్లు దాటేసింది. మరో నాలుగేళ్ల తర్వాత 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ రోహిత్ కొనసాగడం అసాధ్యమే. కాబట్టి ఆఖరి వన్డే వరల్డ్ కప్‌ని కెప్టెన్‌గా ఆడబోతున్నాడు రోహిత్ శర్మ..

68
Image credit: PTI

2011 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్‌గా ఆడిన విరాట్ కోహ్లీ, 2015 వన్డే వరల్డ్ కప్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌కి సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్ కప్‌లో మళ్లీ ఓ సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగబోతున్నాడు..
 

78
Virat Kohli

34 ఏళ్ల విరాట్ కోహ్లీ, మరో నాలుగేళ్ల వరకూ ఆడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఓ కొత్త కెప్టెన్ కెప్టెన్సీలో సీనియర్ ప్లేయర్‌గా 2027 వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఆడొచ్చు.. 

88
ICC World Cup 2011

2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న ఏకైక ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ మినహా మిగిలిన 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ చాలామంది ప్లేయర్లు రిటైర్ అయ్యారు. పియూష్ చావ్లా, రవిచంద్రన్ అశ్విన్ 2023 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. 

Read more Photos on
Recommended Photos