హాఫ్ సెంచరీ చేస్తే, ఇలా చేస్తానని సమైరాకి మాటిచ్చా! తిలక్ వర్మ డ్యాన్సింగ్ సెలబ్రేషన్స్‌కి కారణం ఇదే...

Published : Aug 07, 2023, 11:25 AM IST

వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. అయితే టెస్టుల్లో యశస్వి జైస్వాల్, టీ20 ఫార్మాట్‌లో తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యంగ్ ప్లేయర్లను పరిచయం చేసింది. మొదటి రెండు టీ20ల్లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ..

PREV
16
హాఫ్ సెంచరీ చేస్తే, ఇలా చేస్తానని సమైరాకి మాటిచ్చా! తిలక్ వర్మ డ్యాన్సింగ్ సెలబ్రేషన్స్‌కి కారణం ఇదే...

రెండో టీ20 మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తిలక్ వర్మ, అందరిలా బ్యాటుని లిఫ్ట్ చేయకుండా రెండు చేతులను పైకి కిందకి ఊపుతూ... డ్యాన్సింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన ఈ వెరైటీ డ్యాన్సింగ్ సెలబ్రేషన్స్‌కి ఓ కారణం ఉందట..

26
Sanju Samson and Tilak Varma

‘నాకు చిన్నప్పటి నుంచి రోహిత్ భాయ్, రైనా బాయ్ అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరూ నాకు ఆదర్శం. ఐపీఎల్ సమయంలో రోహిత్ భయ్యాతో చాలా సమయం గడిపాను. ఆయన నన్ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతావని మెచ్చుకున్నారు..

36
Tilak Varma

రోహిత్ చెప్పిన ఆ మాటలు, నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఆ గైడెన్స్ కారణంగానే ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ మరింత క్రమశిక్షణగా ఉండడం నేర్చుకున్నాను... అది నా ఆటకు మరింత ఉపయోగపడింది..   ఆయన నాకు సపోర్ట్ సిస్టమ్ లాంటోడు. 

46

నేను, రోహిత్ భయ్యా కూతురు సమైరా మంచి స్నేహితులం. మేం ఎప్పుడూ ఇలాగే ఆడుకుంటూ ఉంటాం. అందుకే నేను ఎప్పుడు హాఫ్ సెంచరీ చేసినా లేదా సెంచరీ చేసినా తన కోసం ఇలా సెలబ్రేషన్స్ చేస్తానని సమైరాకి మాట ఇచ్చాను..’ అంటూ చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ..
 

56
Tilak Varma

తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, రెండో టీ20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసి మొట్టమొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ అందుకున్నాడు... 
 

66

అతి పిన్న వయసులో టీ20 హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ. మొట్టమొదటి టీ20 హాఫ్ సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ వయసు 20 ఏళ్ల 143 రోజులు కాగా, ప్రస్తుతం తిలక్ వర్మ వయసు 20 ఏళ్ల 271 రోజులు..
 

click me!

Recommended Stories