నేను వాళ్ల చెంప పగొలకొట్టేవాడిని... క్రికెట్ ఆడమంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ...

First Published Jul 3, 2021, 4:45 PM IST

ఒకప్పుడు క్రికెట్‌లో పటిష్టమైన జట్లలో ఒకటిగా ఉన్న శ్రీలంక జట్టు పరిస్థితి చూసి, సగటు క్రికెట్ ఫ్యాన్ ఆవేదన చెందుతున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌లో అసలు ఏ మాత్రం పోరాట ప్రటిమ లేకుండా ఆడుతోంది లంక టీమ్..

పూర్ పర్ఫామెన్స్‌కి తోడు ముగ్గురు క్రికెటర్లు, బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, కెమెరాలకు చిక్కి నిషేధానికి గురి కావడం... శ్రీలంక జట్టులో తీవ్ర కలకలం రేపింది...
undefined
శ్రీలంక క్రికెటర్లు కుశాల్ మెండీస్, ధనుష్క గుణతిలక, నిరోషన్ డిక్‌వాల్... ఇంగ్లాండ్‌లో బయో బబుల్ ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి, అర్ధరాత్రి వీధుల్లో విహరిస్తూ సిగరెట్లు తాగుతూ వీడియోల్లో చిక్కిన విషయం తెలిసిందే...
undefined
ఈ వీడియోలు వైరల్ కావడంతో వారిపై నిషేధం వేటు వేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు, కొన్నాళ్ల పాటు వాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా బ్యాన్ వేయాలని ఆలోచనలు చేస్తోంది...
undefined
‘క్రికెటర్ల పూర్తి ఫోకస్ క్రికెట్‌పైనే ఉండాలి. అందుకే నేనైతే క్రికెటర్లను సోషల్ మీడియా వాడేందుకు అనుమతించదు. క్రికెట్ ఆడండ్రా అంటే... ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్ వాడుతూ కాలక్షేపం చేస్తున్నారు...
undefined
ప్రాక్టీస్‌లో కూడా ఫోన్లను అనుమతిస్తూ, వాళ్లు సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతూ ఉంటే... క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ అస్సలు పట్టించుకోవడం లేదు...
undefined
క్రికెటర్లకు పబ్లిసిటీ కావాలి. నేనే ఇప్పుడు కెప్టెన్‌ని అయి ఉంటే, ఈ ముగ్గురు ప్లేయర్ల చెంప పగలకొట్టేవాడిని. ఒక్కసారి కాదు, మూడు నాలుగు సార్లు చితక్కొట్టేవాడిని...
undefined
ఈ ముగ్గురూ చాలా సీనియర్ ప్లేయర్లు. అందులో కుశాల్ మెండీస్, జట్టుకి వైస్ కెప్టెన్. ఈ సంఘటనపై కచ్ఛితంగా ఎంక్వైరీ జరిపి, ఏం జరిగిందో తేల్చాలి...
undefined
క్రికెట్ స్కిల్స్ ఉన్నా, వీళ్లు క్రికెటర్లు కారని, కేవలం ఓ పాజిటివ్ లైఫ్‌స్టైల్ కోసం ఆశపడే సాధారణ మనుషులని...’ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...
undefined
click me!