దేశవాళీ క్రికెట్ సీజన్‌ను ప్రకటించిన బీసీసీఐ... వరుస టోర్నీలు, లోకల్ క్రికెటర్లకు...

Published : Jul 03, 2021, 04:32 PM IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా సజావుగా సాగని దేశవాళీ క్రికెట్ మళ్లీ తిరిగి వచ్చేసింది. వచ్చే ఏడాది కాలంలో జరపబోయే దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది భారత క్రికెట్ బోర్డు...

PREV
18
దేశవాళీ క్రికెట్ సీజన్‌ను ప్రకటించిన బీసీసీఐ... వరుస టోర్నీలు, లోకల్ క్రికెటర్లకు...

సీనియర్ వుమెన్స్ వన్డే లీగ్‌, సెప్టెంబర్ 21, 2021న ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సీనియర్ వుమెన్స్ వన్డే ఛాలెంజర్ ట్రోఫీ నిర్వహిస్తారు. ఛాలెంజర్ ట్రోఫీ అక్టోబర్ 27, 2021న మొదలవుతుంది...

28

కరోనా కారణంగా జనవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ, మళ్లీ 2021, అక్టోబర్ 20న తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 12న ముగియనుంది...

38

కరోనా కారణంగా గత ఏడాది రద్దయిన రంజీ ట్రోఫీని మళ్లీ ఈ ఏడాది నుంచి యథావిథిగా నిర్వహించనుంది బీసీసీఐ. నవంబర్ 16, 2021 నుంచి ప్రారంభమయ్యే రంజీ సీజన్, ఫిబ్రవరి 19, 2022 వరకూ జరుగుతుంది...

48

రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 23, 2022 నుంచి మార్చి 26 వరకూ విజయ్ హాజరే ట్రోఫీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది బీసీసీఐ...

58

వీటితో పాటు సీకే నాయుడు ట్రోఫీ, మెన్స్ స్టేట్ ఏ వన్డే టోర్నీ, మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్, కూచ్ బెహర్ ట్రోఫీ, వుమన్స్ అండర్ 23 టీ20 లీగ్, అండర్ 23 వన్డే లీగ్ ఇలా వరుస టోర్నీలు జరుగుతాయి.

68

మొత్తంగా ఈ ఏడాది కాలంలో 2127 దేశవాళీ మ్యాచులు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది బీసీసీఐ. దీంతో మహిళల, పురుషులకు సంబంధించిన వివిధ వయసుల టోర్నీలన్నీ ఉంటాయి...

78

రంజీ ట్రోఫీ మీద ఆధారపడి చాలా మంది ప్లేయర్లు బతుకుతున్నారు... రంజీల ద్వారా వచ్చే ఆదాయం వారికి జీవనాధారం, క్రికెట్‌ కొనసాగించడానికి ఊతాన్ని ఇస్తాయి. అందుకే రంజీ, దేశవాళీ టోర్నీలు ఆడినవారికి చెల్లించే వేతనాన్ని కూడా రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

88

భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టునూ పటిష్టం చేసేందుకు ఏడాది పొడవునా క్రికెట్ టోర్నీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అండర్19, అండర్ 23 కేటగిరీల్లో టీ20, వన్డే మ్యాచ్ టోర్నీలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది బీసీసీఐ.

click me!

Recommended Stories