విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం, కేవలం భార్య వల్లే... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్స్...

Published : Dec 19, 2021, 01:01 PM IST

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై రేగిన చిచ్చు, భారత క్రికెట్‌లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్...

PREV
19
విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం, కేవలం భార్య వల్లే... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కామెంట్స్...

విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం ప్రకటించిన తర్వాత సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

29

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని స్వయంగా తానే విరాట్ కోహ్లీని కోరానని, అయితే దానికి అతను ఒప్పుకోలేదని కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

39

సౌతాఫ్రికా టూర్‌కి పయనమయ్యే ముందు ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో విరాట్ కోహ్లీ, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లను తోసిపుచ్చాడు...

49

తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. ఎవ్వరూ వద్దని చెప్పలేదని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

59

విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లపై స్పందించడానికి ఇష్టపడని సౌరవ్ గంగూలీ, ఆ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

69


తాజాగా ఢిల్లీలో ఓ ఈవెంట్‌కి హాజరైన సౌరవ్ గంగూలీ, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

79

‘విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం, అయితే అతను ఎక్కువగా గొడవ పడుతుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

89

అలాగే జీవితంలో ఎప్పుడైనా స్ట్రెస్‌ను ఎదుర్కొన్నారా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు గంగూలీ...

99

‘నా జీవితంలో ఎప్పుడూ ఏ విషయం గురించి నేను స్ట్రెస్ తీసుకోలేదు. కేవలం భార్య, గర్ల్ ఫ్రెండ్ కారణంగానే ప్రస్టేషన్ వస్తుంది...’ అంటూ ఛమత్కరించాడు గంగూలీ...

Read more Photos on
click me!

Recommended Stories