‘థ్యాంక్యూ విరాట్, నీ వల్లే టెస్టులకు క్రేజ్ పెరిగింది’... కోహ్లీ కెప్టెన్సీ గురించి షేన్ వార్న్..

Published : Mar 05, 2022, 05:46 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ మరణాన్ని విషాదంలోకి నెట్టేసింది. కొన్ని గంటల ముందు వరకూ నవ్వుతూ, నవ్విస్తూ మన మధ్య ఉన్న షేన్ వార్న్ లేడనే నిజాన్ని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్మడం లేదు. 

PREV
112
‘థ్యాంక్యూ విరాట్, నీ వల్లే టెస్టులకు క్రేజ్ పెరిగింది’... కోహ్లీ కెప్టెన్సీ గురించి  షేన్ వార్న్..

భారత మాజీ సారథి విరాట్ వందో టెస్టు ఆడుతున్న రోజే, షేన్ వార్న్ అకాల మరణం చెందడంతో కోహ్లీ గురించి వార్న్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి...

212

టెస్టుల్లో అత్యధిక విజయాలు మాత్రమే కాదు, విదేశాల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు...

312

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లార్డ్స్ టెస్టులో, ఓవల్ టెస్టులో తిరుగులేని విజయాలు అందుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది...

412

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును కేవలం రెండు సెషన్లలోనే ఆలౌట్ చేసి, చారిత్రక విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఈ విజయం తర్వాత విరాట్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు షేన్ వార్న్... 

512

‘టెస్టు క్రికెట్ లవర్స్ అందరి తరుపున ‘థ్యాంక్యూ విరాట్ కోహ్లీ’. కేవలం అతని వల్లే టీ20 లీగ్ రోజుల్లో కూడా టెస్టులకు ఇంతటి ఆదరణ దక్కుతోంది...

612

కోహ్లీ వల్లే టీమిండియా ఈ రేంజ్‌లో పర్ఫామ్ చేస్తోంది... అతనికి టెస్టు క్రికెట్ అంటే ఇష్టం... 
వన్డే, టీ20ల కంటే టెస్టు క్రికెట్‌కే విరాట్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. 

712

టెస్టుల్లో భారత జట్టును నెం.1గా నిలబెట్టాడు. ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో టీమిండియా ఓ పవర్ హౌస్. ఆ జట్టులో విరాట్ కోహ్లీ లాంటి ఓ క్రికెట్ సూపర్ స్టార్ ఉన్నాడు...

812

టీమిండియా, భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై గెలిచింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌన్సింగ్ ట్రాక్‌లపై విజయాలను అందుకుంది. ఇంగ్లాండ్‌లోని సీమ్ పరిస్థితుల్లోనూ గెలిచారు... ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలమని నిరూపించారు...

912

ఈ విజయాల వెనక విరాట్ కోహ్లీ కచ్ఛితంగా ఉంటాడు. ఎందుకంటే జట్టులో ప్రతీ ఒక్కరూ అతని కోసం ఏం చేయడానికైనా రెఢీగా ఉంటారు. ఏ జట్టుకైనా అదే కావాలి... అలాగే ఎక్కడైనా గెలవగలమనే నమ్మకాన్ని విరాట్ కోహ్లీ ఇచ్చాడు...

1012

విరాట్ కోహ్లీ ఉన్నంతకాలం టెస్టులకు ఆదరణ ఉంటుంది. అందుకే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో సాధ్యమైనంత ఎక్కువ కాలం టెస్టుల్లో కొనసాగాలని నేను కోరుకుంటున్నా...

1112

బెస్ట్ టీమ్ ఇన్ ది వరల్డ్... లాంగ్ లివ్ టెస్టు క్రికెట్...’ అంటూ ఆ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశంసల్లో ముంచెత్తాడు ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.

1212

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేసిన షేన్ వార్న్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు తొలి టెస్టు ఆడుతున్న రోజే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది...

click me!

Recommended Stories