విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, భారత క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది. ఈ వివాదం రేపిన చిచ్చుతో బీసీసీఐ ప్రతీ అడుగు ఆచీతూచీ వేస్తోందట...
ఇంగ్లాండ్ టూర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు వరకూ సుదీర్ఘ ఫార్మాట్‌లో కెఎల్ రాహుల్‌కి చోటు కూడా లేదు...
210
ఈ ఏడాదిలో భారత జట్టు 12 టెస్టులు ఆడితే, అందులో కెఎల్ రాహుల్ ఆడింది కేవలం నాలుగే మ్యాచులు. అయినా కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
310
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన రోహిత్ శర్మ, ఇకపై టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది...
410
అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో తాత్కాలిక వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
510
ఈ ఏడాది 10 టెస్టులు ఆడి, అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్‌కి కానీ, కొన్నేళ్లుగా భారత టెస్టు టీమ్‌లో మెయిన్ ప్లేయర్‌గా మారిన రవిచంద్రన్ అశ్విన్‌కి కానీ వైస్ కెప్టెన్సీ దక్కుతుందని భావించారు క్రికెట్ విశ్లేషకులు...
610
అయితే కెఎల్ రాహుల్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి ప్రధాన కారణం భవిష్యత్తులో భారత సారథిగా కెఎల్ రాహుల్‌ను పరిగణిస్తుండడమే కారణమని తెలుస్తోంది...
710
పేలవ ఫామ్ కారణంగా టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన అజింకా రహానే స్థానంలో ఛతేశ్వర్ పూజారా, లేదా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేస్తే... వారి వయసును వంకగా చూపిస్తూ విమర్శలు రేగే అవకాశం ఉంది...
810
ఈ ఇద్దరూ ఇప్పటికే 32+ వయసు దాటేసినవాళ్లే. ఈ వయసులో వారికి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇస్తే, ఫ్యూచర్‌లో కెప్టెన్‌గా నియమించే ఆలోచనలు ఉన్నాయా? అంటూ ట్రోల్స్ వచ్చే అవకాశముందని సెలక్టర్లు సేఫ్ గేమ్ ఆడరని అంటున్నారు విశ్లేషకులు...
910
అయితే ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్ లేని కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ ఇచ్చే బదులు, ఐపీఎల్‌లో కెప్టెన్‌గానూ దూకుడు చూపించిన రిషబ్ పంత్‌కి వైస్ కెప్టెన్సీ ఇస్తే సరిగ్గా ఉండేదనేవాళ్లు లేకపోలేదు...
1010
రోహిత్ శర్మ గాయపడిన సమయంలో తాత్కాలికంగా అయినా రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టు వైస్ కెప్టెన్సీ అప్పగించే ఉంటే, అతని సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్టు ఉండేదని అంటున్నారు అభిమానులు...