సచిన్ టెండూల్కర్ 5, విరాట్ కోహ్లీ 2... సౌతాఫ్రికా టూర్‌లో భారత టెస్టు సెంచరీలు ఇవే...

Published : Dec 21, 2021, 12:44 PM IST

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై కూడా టెస్టు సిరీస్ సాధించిన భారత జట్టు, ఇప్పటిదాకా సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే ఈసారి టెస్టు సిరీస్ లక్ష్యంగా బరిలో దిగనుంది విరాట్ సేన...

PREV
112
సచిన్ టెండూల్కర్ 5, విరాట్ కోహ్లీ 2... సౌతాఫ్రికా టూర్‌లో భారత టెస్టు సెంచరీలు ఇవే...

1992 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లు జరుగుతున్నాయి. అయితే ఈ సిరీస్‌లలో దక్షిణాఫ్రికాకే ఆధిక్యం ఉంది. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన 7 సార్లు దక్షిణాఫ్రికా జట్టు విజయాన్ని అందుకోగా, 4 సార్లు భారత జట్టుకి (స్వదేశంలో) సిరీస్ విజయం దక్కింది. మూడు సిరీస్‌లు డ్రాలుగా ముగిశాయి...

212

సౌతాఫ్రికా గడ్డపై భారత క్రికెటర్లు 14 టెస్టు సెంచరీలు నమోదు చేశారు. ఇందులో భారత మాజీ క్రికెటర్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఐదు సెంచరీలు చేశాడు...

312

1992 టూర్‌లో డర్బన్‌లో జరిగిన టెస్టులో ప్రవీన్ అమ్రే 103 పరుగులు చేసి, సౌతాఫ్రికా గడ్డ మీద తొలి టెస్టు సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

412

అదే టూర్‌లో జోహన్‌బర్గ్ టెస్టులో సచిన్ టెండూల్కర్ 111 పరుగులు చేయగా, భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 129 పరుగులు చేశాడు...

512

1997 టూర్‌లో సచిన్ టెండూల్కర్, కేప్‌ టౌన్ టెస్టులో 169 పరుగులు చేయగా, అదే వేదికగా మహ్మద్ అజారుద్దీన్ 115 పరుగులతో అదరగొట్టాడు...

612

1997లో జోహన్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో రాహుల్ ద్రావిడ్ 148 పరుగులు చేశాడు. 2001 పర్యటనలో బ్లోఫోటిన్ వేదికగా జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ 155 పరుగులు చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ 105 పరుగులు చేశాడు...

712

2007 లో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ 116 పరుగులతో రాణించాడు... ఈ పర్యటనలో సెంచరీ చేసిన ఒకే ఒక్క భారత క్రికెటర్ జాఫర్...

812

2010-11 సౌతాఫ్రికా పర్యటనలో సచిన్ టెండూల్కర్ మరోసారి సఫారీ గడ్డపై అదరగొట్టాడు. సెంచూరియన్‌లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సచిన్, కేప్ టౌన్‌లో 146 పరుగులు చేశాడు. 

912

ఈ పర్యటనలో సచిన్ 326 పరుగులు చేసి, సౌతాఫ్రికా టూర్‌లో ఒకే సిరీస్‌లో 300+ పరుగులు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

1012

2013 సఫారీ టూర్‌లో జోహన్‌బర్గ్‌లో ఛతేశ్వర్ పూజారా 153 పరుగులు చేశాడు. అదే టూర్‌లో విరాట్ కోహ్లీ 119 పరుగులు చేసి అదరగొట్టాడు...

1112

2017-18 గత సౌతాఫ్రికా పర్యటనలో భారత సారథి విరాట్ కోహ్లీ సెంచూరియన్‌లో 153 పరుగులు చేసి... సచిన్ టెండూల్కర్ తర్వాత సఫారీ గడ్డపై రెండు సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

1212

మొత్తంగా సౌతాఫ్రికాలో భారత క్రికెటర్లు 14 సెంచరీలు చేస్తే, అందులో సచిన్ 5, విరాట్ కోహ్లీ 2 టెస్టు సెంచరీలు చేయగా ప్రవీన్ ఆమ్రే, కపిల్‌ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వసీం జాఫర్, ఛతేశ్వర్ పూజారా తలా ఓ సెంచరీ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories