గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది, ఆ బాధేంటో... షోయబ్ అక్తర్ కామెంట్లపై మార్క్ వుడ్ రియాక్షన్..

First Published Dec 15, 2022, 3:11 PM IST

17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు తొలి రెండు టెస్టుల్లో గెలిచి సిరీస్‌ని సొంతం చేసుకుంది. గాయం కారణంగా రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఆడని మార్క్‌వుడ్, ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు...

Mark Wood

ముల్తాన్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం తర్వాత పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, మార్క్ వుడ్ బౌలింగ్‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. మార్క్‌వుడ్ 160+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయాలంటే అతను ట్రక్స్ లాగాల్సి ఉంటుంది, కండలు పెంచడానికి భారీగా బరవులు ఎత్తాల్సి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు...

Mark Wood

‘మార్క్‌వుడ్ బౌలింగ్‌లో నేను కొన్ని విషయాలు గమనించా. అతను ఎక్కువ దూరం పరుగెత్తలేకపోతున్నాడు. అందుకేనేమో రన్నరప్‌ని తక్కువ చేసుకున్నాడు. ఎడమ కాలిపై అడుగు వేసి, కంట్రోల్ తప్పి పడిపోతున్నాడు. నాకు తెలిసి మార్క్‌వుడ్, నేను 155 కంటే ఎక్కువ వేగంగా బౌలింగ్ చేయలేనని అనుకుంటున్నాడేమో...

కానీ అది తప్పు మార్క్‌వుడ్ తలుచుకుంటే 100 ఎంపీహెచ్ (160+ కి.మీ.ల) వేగంతో బౌలింగ్ చేయగలడు. అయితే అందుకు అతను ఇప్పుడు ఫిట్‌నెస్ సరిపోదు. ట్రాక్స్‌ లాగాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో పిచ్ 26 గజాలు ఉంటుంది. నార్మల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ బరువుండే బంతితో ప్రాక్టీస్ చేసేవాడిని...
 

Shoaib Akhtar

భారీగా బరువులు ఎత్తేవాడిని. సైకిల్ మీద బస్తాలు పెట్టుకుని తొక్కేవాడిని. నా కండలు పెంచుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేశా. ఎంత కష్టపడ్డానంటే నా ఎముకలు కూడా అరిగిపోయాయి. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే 150+ వేసే బౌలర్లు అందరూ 160+ వేగాన్ని అందుకోవచ్చు...’ అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్...

mark wood

ఈ కామెంట్లపై మార్క్ వుడ్ స్పందించాడు. ‘నేను 100ఎంపీహెచ్ వేగంతో బౌలింగ్ వేయలంటే ట్రక్కులు లాగాల్సి ఉంటుందని అక్తర్ అన్నాడు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది, ఆ బాధంటో... నేను బలహీనంగా ఉన్నానో అతనికి తెలీదు. నేను నాకున్న బలంతో ఏ ట్రక్కునీ లాగలేను...

mark wood

అయితే అక్తర్ లాంటి ఫాస్ట్ బౌలర్ నా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంతోషాన్నిచ్చింది. ఇక్కడి జనాలు క్రికెట్‌ని ఎంతో ప్రేమిస్తారు. వారి ఫాస్ట్ బౌలింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా బాడీని ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్.. 

click me!