సారీ రాహుల్! నీతో నీచంగా ప్రవర్తించా... 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకి క్షమాపణలు చెప్పిన ఆలెన్ డొనాల్డ్...

First Published Dec 15, 2022, 1:29 PM IST

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనవసర ప్రయోగాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు రాహుల్ ద్రావిడ్. అయితే భారత క్రికెటర్‌గా మాత్రం రాహుల్ ద్రావిడ్ చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్లాస్ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయే రాహుల్ ద్రావిడ్, ప్రత్యర్థి బౌలర్లు సెడ్జింగ్ చేసినా ఎంతో హుందాగా ప్రవర్తించేవాడు...

Image credit: Getty

క్రీజులో పాతుకుపోయి బౌలర్లకు విసుగు తెప్పించి, ప్రత్యర్థి జట్టు సహనానికి పరీక్ష పెట్టే రాహుల్ ద్రావిడ్... ‘ది వాల్’గా, ‘మిస్టర్ డిపెండబుల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ద్రావిడ్ ఏకాగ్రతను దెబ్బ తీయడానికి ప్రత్యర్థి బౌలర్లు శతవిధాలుగా ప్రయత్నించేవాళ్లు...

Rahul Dravid

1997లో డర్భన్‌లో జరిగిన వన్డే  మ్యాచ్‌లో సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆలెన్ డొనాల్డ్, రాహుల్ ద్రావిడ్‌ని తిడుతూ సెడ్జ్ చేశాడు. 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు తాజాగా క్షమాపణలు కోరాడు ఆలెన్ డొనాల్డ్...

‘డర్భన్‌లో జరిగింది చాలా నీచమైన సంఘటన. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ క్రీజులో పాతకుపోయి, మమ్మల్ని బాదడం మొదలెట్టారు. నేను ఎలాగైనా వికెట్ తీయాలని ఫిక్స్ అయ్యా..

రాహుల్ ద్రావిడ్ ఏకాగ్రతను చెడగొట్టడానికి బూతులు తిట్టడం మొదలెట్టా. రాహుల్ ద్రావిడ్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అతనితో బయటికి వెళ్లి, కూర్చొని ఆ రోజు జరిగినదానికి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. నేను చేసింది సిల్లీ పని... దాని వల్లే అతను అవుట్ అయ్యాడు...

నేను ఆ రోజు అన్న ప్రతీ మాటకు క్షమాపణలు కోరుతున్నా. రాహుల్ ద్రావిడ్ ఓ అద్భుతమైన ఆటగాడు, అంతకుమించి మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి. రాహుల్, నువ్వు వింటున్నావుగా... నాతో ఓ డిన్నర్ అవుట్‌కి వస్తావని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆలెన్ డొనాల్డ్... 

Image credit: PTI

ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా ఉండగా, టీమిండియాకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు రాహుల్ ద్రావిడ్. ఆలెన్ డొనాల్డ్ కామెంట్లకు ద్రావిడ్ స్పందించాడు. ‘కచ్చితంగా రావడానికి సిద్ధంగా ఉన్నా.. అయితే బిల్లు అతనే కట్టాలి...’ అంటూ ఛమత్కరించాడు రాహుల్ ద్రావిడ్.. 

click me!