టీమిండియాకు తిప్పలు తప్పవు.. మా ప్రణాళికలు మాకున్నై : రోహిత్ సేనకు వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లాండ్ మాజీ సారథి

First Published Jun 28, 2022, 5:35 PM IST

IND vs ENG: ఇంగ్లాండ్ తో ఆడబోయే ఐదో టెస్టులో భారత్ కు తిప్పలు తప్పవంటున్నాడు ఆ జట్టు మాజీ సారథి జో రూట్.. ఇండియాకు ఝలక్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నాడు. 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జులై 1 నుంచి ఎడ్జబాస్టన్ వేదికగా గతేడాది ఆడాల్సి ఉన్న ఐదో టెస్టు కోసం ఇరు జట్లు సాధన చేస్తున్నాయి. ఇప్పటికే బర్మింగ్ హోమ్ చేరుకున్న ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. మరోవైపు సోమవారం కివీస్ తో సిరీస్ ను ముగించుకున్న ఇంగ్లాండ్ కూడా బుధవారం అక్కడికి రానుంది. 

అయితే చివరి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. గతేడాదితో పోలిస్తే తమ జట్టు చాలా మెరుగైందని.. టీమిండియా కొత్త ఇంగ్లాండ్ ను చూడబోతుందని  ఆ జట్టు నయా  సారథి బెన్ స్టోక్స్ అనగా.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ సారథి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. 

రూట్ మాట్లాడుతూ.. ‘మేం తర్వాత టీమిండియాతో టెస్టు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కోసం మా ప్రణాళికలు మాకున్నై. మా కెప్టెన్ బెన్ స్టోక్స్ దగ్గర టీమిండియాను బోల్తా కొట్టించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.  ఇండియాతో పాటు  ఆ తర్వాత రాబోయే సిరీస్ లకు కూడా అతడు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాడు..’ అని తెలిపాడు. 

joe root

గతేడాది భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పడు  రూట్ ఆ  జట్టుకు సారథిగా ఉన్న విషయం తెలిసిందే.  నాలుగు టెస్టులలో రూట్ గొప్ప ప్రదర్శనలేమీ కనబరచకపోయినా అతడు కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాక తిరిగి ఫామ్ ను అందుకున్నాడు.   

సోమవారం ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో రెండు సెంచరీలతో పాటు 1 హాఫ్ సెంచరీతో ఆరు ఇన్నింగ్స్ లలో 396 పరుగులు చేశాడు. దీంతో అతడు డారిల్ మిచెల్ (538 రన్స్) తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపికయ్యాడు. 

కాగా టీమిండియాతో సిరీస్ లో భారత ఆటగాళ్లు కొత్త ఇంగ్లాండ్ జట్టును చూస్తారని బెన్ స్టోక్స్ చెప్పాడు. ప్రత్యర్థి ఎవరన్నది తమకు సంబంధం లేదని.. కివీస్ ను 3-0తో ఓడించినట్టే టీమిండియాతో కూడా దూకుడుగా ఆడి విజయం సాధిస్తామని  స్టోక్స్ భారత జట్టుకు హెచ్చరికలు పంపాడు. 
 

click me!