IPL Auction: నన్ను, అతడిని ఢిల్లీ తీసుకోవడం లేదు : ఐపీఎల్ మెగా వేలం ముందు అశ్విన్ షాకింగ్ కామెంట్స్

First Published Nov 23, 2021, 11:47 AM IST

Ashwin:  వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం కొద్దిరోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో ఢిల్లీ తనను తీసుకోదని అన్నాడు. తనతో పాటు మరో టీమిండియా  బ్యాట్స్మెన్ ను కూడా ఆ జట్టు పక్కనబెడుతుందని కామెంట్స్ చేశాడు. 

వచ్చే నెల ఆఖర్లో లేదా2022 జనవరిలో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ముందు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఈ ఆఫ్ స్పిన్నర్.. వచ్చే  సీజన్ లో తాను ఆ జట్టు తరఫున ఆడబోయేది సందేహమే అని కామెంట్ చేశాడు. 

యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన అశ్విన్.. తనతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కూడా ఢిల్లీ రిటైన్ చేసుకోవడం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. 

అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ నన్ను రిటైన్ చేసుకోవడం లేదు. నాతో  పాటు శ్రేయస్ అయ్యర్ ను కూడా ఆ జట్టు తిరిగి తీసుకోవడం లేదు.

ఒకవేళ మమ్మల్ని అట్టిపెట్టుకునే ఆలోచన ఉంటే ఇప్పటివరకే అందుకు సంబంధించిన సమాచారం అందించి ఉండేవాళ్లు. కానీ వాళ్ల నుంచి ఇంతవరకూ నాకు అలాంటిదేమీ రాలేదు...’ అని తెలిపాడు. 

అయితే ఆ జట్టు సారథి రిషభ్ పంత్, ఓపెనింగ్  బ్యాటర్ పృథ్వీ షా తో పాటు సౌతాఫ్రికా బౌలర్ ఆన్రిచ్ నార్త్జ్ లను మాత్రం ఢిల్లీ రిటైన్ చేసుకునే అవకాశమున్నట్టు అశ్విన్ చెప్పాడు. వారితో పాటు నాలుగో వ్యక్తిగా అవేశ్ ఖాన్ గానీ అక్షర్ పటేల్ ను గానీ తీసుకునే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

బీసీసీఐ ఇటీవలే వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ లో ఒక జట్టు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో ముగ్గురు స్వదేశీ ఆటగాళ్లు ఒక విదేశీ ఆటగాడు ఉండాలి.  

2022 ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ ఆఖర్లో గానీ జనవరి మొదటివారంలో గానీ ఐపీఎల్ మెగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 30 వరకు అన్ని జట్లు.. తాము రిటైన్ చేసుకునే నలుగురు ప్లేయర్ల జాబితాను ఇవ్వవలసి ఉంటుంది. దానికి మరో వారం రోజుల గడువే ముందున్నది.  దీంతో ఆయా జట్లన్నీ ఎవరిని తమతో అట్టిపెట్టుకోవాలి..? ఎవర్ని వదిలించుకోవాలో తెలియక సతమతమవుతున్నాయి. 

కాగా.. శ్రేయస్ అయ్యర్ 2015 నుంచి ఢిల్లీ తోనే ఉన్నాడు. ఆ జట్టు తరఫున అయ్యర్ 1916 పరుగులు చేశాడు. ఇక అశ్విన్.. 2020లో ఢిల్లీతో చేరాడు. ఐపీఎల్ 2020లో అతడు ఢిల్లీ తరఫున 15 మ్యాచులాడి 13 వికెట్లు తీశాడు. ఇటీవల ముగిసిన సీజన్లో 13 మ్యాచులాడి 7 వికెట్లు తీశాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్.. అశ్విన్ ను రూ. 7.6 కోట్లకు కొనుగోలు చేసింది. 

click me!