నమ్మండి, నాలో గొప్ప కెప్టెన్ ఉన్నాడు, టీమిండియాను నడిపించగలను... కెఎల్ రాహుల్ కామెంట్స్...

Published : Jan 25, 2022, 04:19 PM IST

టీమిండియాలో సౌతాఫ్రికాలో ఓడిన చరిత్ర ఉంది కానీ వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన చెత్త రికార్డు మాత్రం కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే వచ్చింది. జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి పరిచయం చేసిన కెప్టెన్ కూడా కెఎల్ రాహులే...

PREV
113
నమ్మండి, నాలో గొప్ప కెప్టెన్ ఉన్నాడు, టీమిండియాను నడిపించగలను... కెఎల్ రాహుల్ కామెంట్స్...

వరుసగా నాలుగు పరాజయాలు అందుకుని, గత 60 ఏళ్లల్లో ఈ రికార్డు నెలకొల్పిన పరమ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నప్పటికీ, తనలో గొప్ప కెప్టెన్ ఉన్నాడని అంటున్నాడు కెఎల్ రాహుల్...

213

మూడు వన్డేల్లో రెండుసార్లు టాస్ గెలిచిన కెఎల్ రాహుల్, ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయాడు. అటు లక్ష్యఛేదనలో కానీ, ఇటు భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు పెట్టి, దాన్ని కాపాడుకోవడంలో కానీ టీమిండియా ఫెయిల్ అయ్యింది...

313

‘టీమిండియాని నడిపించే అవకాశం రావడం ఎప్పుడూ గౌరవమే. ఏ క్రికెటర్ అయినా ఇలాంటి రోజు కోసమే కలలు కంటాడు, నా కల నెరవేరిన క్షణాలివి...

413

అయితే అనుకున్న ఫలితాలైతే రాలేదు, ఈ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి..

513

వరల్డ్ కప్ టోర్నీలు రాబోతున్నాయి. ఐసీసీ టైటిల్స్ గెలవాలంటే మరింత మెరుగైన జట్టుగా తయారుకావాల్సిన అవసరం చాలా ఉంది...

613

గత నాలుగైదు ఏళ్లుగా మేం చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాం... అయితే వైట్ బాల్‌ క్రికెట్‌లో మరింత మెరుగు కావాలి, ఐసీసీ టోర్నీలకు ముందు దొరికిన ఈ సమయం అందుకే వినియోగిస్తాం...

713

ఓటములకు కారణాలు, సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. అయితే మిడిల్ ఆర్డర్ వైఫల్యమే మా ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం...

813

నేను కూడా ఈ సిరీస్ ద్వారా కెప్టెన్‌‌గా చాలా విషయాలు నేర్చుకున్నా. పరాజయాలు, విజయానికి తొలి మెట్టు అని నేను నమ్ముతాను...

913

నా కెరీర్ కూడా ఇలాగే మొదలైంది. నాకు ప్రతిదీ నెమ్మదిగా దక్కింది... నాలో గొప్ప కెప్టెన్ ఉన్నాడు, నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి...

1013

అంతేకాదు ప్లేయర్ల నుంచి బెస్ట్ రిజల్ట్ ఎలా రాబట్టాలో కూడా బాగా తెలుసు. నా దేశానికి కెప్టెన్‌గా విజయాలు అందించగలను, ఫ్రాంఛైజీకి కూడా...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్...

1113

ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్. రెండు సీజన్లలోనూ పంజాబ్ కింగ్స్ జట్టు ఆరో స్థానానికే పరిమితమైంది...

1213

గత సీజన్‌లో 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, ఈ ఏడాది కూడా 620+ పరుగులు చేశాడు. అయితే జట్టును విజయపథంలో నడిపించడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

1313

చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకోవడం పంజాబ్ కింగ్స్‌కి అలవాటు. సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన వన్డే సిరీసుల్లో కూడా టీమిండియా ఆటతీరు ఇలాగే సాగింది...

Read more Photos on
click me!

Recommended Stories