మాహీ భాయ్ నన్ను తప్పులు చేయనిచ్చాడు, వాటినుంచే... అహ్మదాబాద్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా....

Published : Jan 25, 2022, 03:43 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియా రెండు వరల్డ్‌కప్ టైటిల్స్ అందించిన కెప్టెన్. అంతకుమించి ఎంతో మంది యువ క్రికెటర్లను స్టార్లుగా మలిచిన మాజీ కెప్టెన్... ఐపీఎల్‌లో కెప్టెన్లుగా మారిన కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా,సంజూ శాంసన్ వంటి ప్లేయర్లు, మాహీ కెప్టెన్సీలో ఆడినవాళ్లే...

PREV
116
మాహీ భాయ్ నన్ను తప్పులు చేయనిచ్చాడు, వాటినుంచే... అహ్మదాబాద్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా....

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన బరోడా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత కొద్దిరోజులకే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు..

216

2016, జనవరి 27న 22 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు హార్ధిక్ పాండ్యా... 

316

అంతర్జాతీయ కెరీర్‌లో వేసిన మొదటి మూడు బంతులను వైడ్‌లు వేసిన హార్ధిక్ పాండ్యా, తన తొలి ఓవర్‌లో 11 బంతులు విసిరి 19 పరుగులు సమర్పించాడు...

416

రెండో ఓవర్ వేయడానికి హార్ధిక్ పాండ్యాకి బంతి అందించిన ఎమ్మెస్ ధోనీ, అతనితో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత అతని బౌలింగ్‌ మారిపోయింది...

516

క్రిస్ లీన్, మాథ్యూ వైడ్ వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 37 పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత పాండ్యా వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు..

616

‘భారత జట్టులో ప్రతీ ఒక్కరి నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా ఎమ్మెస్ ధోన జట్టులో ఉన్నప్పుడు నేను ఓ ముడిసరుకుగా ఉన్నా...

716

అలాంటి నన్ను, జట్టుకి కావాల్సినట్టుగా చెక్కింది మాత్రం మాహీయే. మాహీ భాయ్ నాకు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చాడు...

816

ఫ్రీగా తప్పులు చేయనిచ్చాడు, ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు. వాటిని మళ్లీ రిపీట్ చేయకుండా చేయాల్సిన హోంవర్క్ చేయించాడు...

916

నా తప్పుల నుంచి నాకు నేను స్వయంగా పాఠాలు నేర్చుకునేలా చేశాడు... నేను జట్టులోకి వచ్చిన కొత్తలో ప్రతిదీ మాహీ భాయ్ చూసుకుంటాడులే అనుకునేవాడిని...

1016

ఇక్కడ బౌలింగ్ వెయ్, అక్కడ బౌలింగ్ వేయ్ అని మాహీ భాయ్ చెబుతాడని అనుకునేవాడిని, అలా చెప్పకపోయేసరికి షాక్ అయ్యా... 

1116

అయితే జట్టులో నాకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలంటే నాకు నేనుగా వికెట్ రావాలంటే ఏం చేయాలో నేర్చుకోవాలని తెలుసుకున్నా... 

1216

నా మొదటి ఓవర్‌లో 20 పరుగులు ఇచ్చిన తర్వాత, నా కెరీర్‌ ఇక్కడే ముగిసిపోతుందని అనుకున్నా. అదే నాకు ఆఖరి మ్యాచ్ అవుతుందని భయపడ్డా...

1316

అయితే రెండో ఓవర్ వేయమని మాహీ భాయ్ నాకు బాల్ అందించినప్పుడు, నా వెనక ఒకరున్నారనే భరోసా నాలో నిండింది...

1416

ఆ భరోసాతో వేసిన రెండో ఓవర్... అన్నింటినీ మార్చేసింది. మాహీ భాయ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా... ’ అంటూ చెప్పుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా...

1516

గాయం కారణంగా గత రెండు ఐపీఎల్ సీజన్లలో బౌలింగ్ చేయని హార్ధిక్ పాండ్యాని రూ.15 కోట్లకు కొనుగోలు చేసిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, అతన్ని కెప్టెన్‌గాం ఎంచుకుంది...

1616

హార్ధిక్ పాండ్యాతో పాటు ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను రూ.15 కోట్లకు, కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ...

Read more Photos on
click me!

Recommended Stories