అక్కడి ముస్లింలు మాకే సపోర్ట్! అందుకే వచ్చారు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

First Published | Oct 1, 2023, 3:46 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇండియాలో అడుగుపెట్టిన పాకిస్తాన్‌కి, హైదరాబాద్‌లో మంచి స్వాగతం లభించింది. పనికట్టుకుని పాక్ క్రికెట్ టీమ్‌కి స్వాగతం చెప్పేందుకు హైదరాబాద్‌ జనాలు, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లకపోయినా.. వివిధ పనుల కోసం అక్కడి వచ్చిన వాళ్లను చూసి తమను చూసేందుకు వచ్చినట్టు ఫీలైపోయింది పాకిస్తాన్ క్రికెట్ టీమ్..

హైదరాబాద్‌లో లభించిన స్వాగతానికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా మురిసిపోయింది. 2016లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి వచ్చిన పాకిస్తాన్, మళ్లీ ఏడేళ్లకు భారత్‌లో అడుగుపెట్టింది. అప్పుడు వచ్చిన టీమ్‌లో పాక్ ప్లేయర్లు ఎవ్వరూ ఇప్పటి టీమ్‌లో సభ్యులుగా లేరు..

బాబర్ ఆజమ్‌తో సహా పాక్ క్రికెటర్లు షాహీన్ ఆఫ్రిదీ, మహ్మద్ రిజ్వాన్, షాదబ్ ఖాన్ అండ్ కో మొట్టమొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టారు... ఇక్కడి అతిథి మర్యాదలకు ఉప్పొంగిపోతున్నారు..

Latest Videos


భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అడుగుపెట్టగానే భారత్‌ని శత్రుదేశంగా అభివర్ణించాడు పీసీబీ ఛీప్ జాకా ఆష్రఫ్. ‘శత్రుదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్నామో తెలిసి ఆడాలి..’ అంటూ వ్యాఖ్యానించాడు..
 

తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ గొడవకు హిందూ- ముస్లింలు మత మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నాడు..

‘అహ్మదాబాద్‌, హైదరాబాద్ ఈ రెండు నగరాల్లో ముస్లింలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్లలో చాలామంది పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తారు. అందుకే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పాక్ టీమ్‌కి మంచి సపోర్ట్ దక్కింది..’ అంటూ వ్యాఖ్యానించాడు ముస్తాక్ అహ్మద్..

click me!