ఇండియాలో ఏ వెధవైనా వికెట్లు తీస్తాడు! ఎవరు లేకనే అశ్విన్‌కి చోటు.. లక్ష్మణ్ శివరామకృష్ణన్ షాకింగ్ కామెంట్స్.

Published : Oct 01, 2023, 11:57 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. అక్షర్ పటేల్‌ని తప్పించి, అశ్విన్‌కి టీమ్‌లో చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

PREV
18
ఇండియాలో ఏ వెధవైనా వికెట్లు తీస్తాడు! ఎవరు లేకనే అశ్విన్‌కి చోటు..   లక్ష్మణ్ శివరామకృష్ణన్ షాకింగ్ కామెంట్స్.

అక్షర్ పటేల్ గాయపడితే, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండగా రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.. తాజాగా భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశాడు..
 

28
Laxman Sivaramakrishnan

‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కామెంటరీ ప్యానెల్‌లో సరైన ఓ స్పిన్నర్ కూడా లేదు. ఇండియాలో జరగబోతున్న టోర్నీలో స్పిన్ కీలకం. ఇప్పుడు జనాలు, స్పిన్ బౌలింగ్ గురించి ఎలా తెలుసుకుంటారు...

38
Former Indian Cricketer Laxman Sivaramakrishnan

కామెంటరీ ప్యానెల్‌లో బ్యాటర్లు, మరికొందరు కలర్ కామెంటేటర్లు మాత్రమే ఉన్నారు. వాళ్లకి స్పిన్ గురించి తెలుస్తుందా? ఇది కరెక్ట్ కాదు.. ’ అంటూ ట్వీట్లు చేశాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్.. 

48
Ravichandran Ashwin

దీనికి ఓ నెటిజన్ స్పందించాడు. ‘భారత బ్యాటర్లు కూడా స్పిన్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు. కింగ్ కోహ్లీ కూడా. రవిచంద్రన్ అశ్విన్‌ని సెలక్ట్ చేయడం వల్ల అతను వికెట్లు తీయగలడు, త్వరగా వికెట్లు పడితే బ్యాటింగ్ కూడా చేయగలడు. స్పిన్ పిచ్‌లు కాకుండా ఫ్లాట్ పిచ్‌లు తయారుచేస్తారని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు నెటిజన్. దీనికి లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు..

58
Ravichandran Ashwin

‘భారత బ్యాటర్లు పిచ్ ఆడడానికి కష్టపడడానికి కారణం, ఇక్కడి పిచ్‌లు అశ్విన్, టెస్టుల్లో వికెట్లు తీయడానికి వీలుగా రూపొందించబడ్డాయి. అదే అశ్విన్, విదేశాల్లో తీసిన రికార్డు చూడండి. ఇండియాలో పిచ్‌లపైన ఏ వెధవైనా వికెట్లు తీస్తాడు..
 

68
Ravichandran Ashwin

నేరుగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి గ్రౌండ్‌కి వెళ్లి, గ్రౌండ్‌ స్టాఫ్‌ని కలిసి ఎక్కడ ట్యాంపర్ చేయాలో చెబుతాడు.. నేను చాలా సార్లు నా కళ్లతో చూశాను. ప్రతీ దానికి చాలా కారణాలు చెప్పొచ్చు. అశ్విన్ తీసిన వికెట్లలో 378 వికెట్లు, ఇండియాలోనే వచ్చాయి..

78
Image credit: Getty

ఎవ్వరూ లేకపోవడం వల్లే అశ్విన్‌కి అవకాశం ఇచ్చారు. ఫీల్డింగ్ సరిగా రాదు, ఫిట్‌నెస్ లేదు.. మోస్ట్ అన్‌ఫిట్ క్రికెటర్...’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్.

88

ఇంత పచ్చిగా అశ్విన్‌ని విమర్శించడంతో లక్ష్మణ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమోనని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి లక్ష్మణ్, ‘లేదు.. నేనే చెబుతున్నా...’ అంటూ రిప్లై ఇచ్చాడు..
 

click me!

Recommended Stories