అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది... కెప్టెన్‌గా రోహిత్ శర్మపై, ప్లేయర్‌గా విరాట్ కోహ్లీపై...

First Published Jan 28, 2022, 1:46 PM IST

అత్యంత క్లిష్టమైన, కష్టమైన సౌతాఫ్రికా సిరీస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది భారత జట్టు. సెంచూరియన్‌లో గెలిచిన టెస్టు తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి, వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది టీమిండియా...

వచ్చే నెలలో వెస్టిండీస్‌తో కలిసి వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే ఈ సిరీస్‌లకి జట్టును కూడా ప్రకటించేసింది బీసీసీఐ...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి పూర్తి స్థాయి భారత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, విండీస్‌తో సిరీస్ ద్వారా వన్డే కెప్టెన్‌గానూ కెరీర్ మొదలెట్టబోతున్నాడు...

అయితే ఇక్కడే రోహిత్ శర్మకు అసలు సమస్య ఎదురుకానుంది. వన్డేల్లో భారత జట్టు ప్రదర్శన ఏ మాత్రం సరిగా లేదు... ఆస్ట్రేలియాలో, సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లు కోల్పోయింది భారత జట్టు..

యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా రిటైరైన తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సరిగా రాణించలేకపోతున్నారు...

గాయపడకముందు కొద్దో గొప్పో రాణించిన శ్రేయాస్ అయ్యర్, సౌతాఫ్రికా టూర్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు... ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్‌లో మెరిస్తే, రెండు మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్నాడు.  హార్ధిక్ పాండ్యా గాయం తర్వాత సరైన ఆల్‌రౌండర్ దొరకడం లేదు...

శార్దూల్ ఠాకూర్ బ్యాటుతో మెరుస్తున్నా, వికెట్లు తీయడంలో ఫెయిల్ అవుతున్నాడు, అంతేకాక భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు...

అన్నింటికీ మించి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని బ్యాట్స్‌మెన్‌గా ఎలా ఉపయోగించాలనేది రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్..

కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో బాగానే రాణించాడు. అయితే రాహుల్ కెప్టెన్సీ కాని కెప్టెన్సీలో ఆడడం వేరు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్లేయర్‌గా ఆడడం వేరు...

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య సంబంధాలు సరిగా లేవని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరి రోహిత్ కెప్టెన్సీలో విరాట్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది..

వెస్టిండీస్ జట్టును స్వదేశంలో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే టీమిండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో విండీస్‌ను ఓడించినా, అది పెద్ద విజయమే...

ఎన్నో సమస్యలతో బరిలో దిగుతున్న భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే, టీ20 సిరీస్‌లలో ఎలా ఆడుతుందనేది టీమిండియా ఫ్యూచర్ పర్ఫామెన్స్‌ని డిసైడ్ చేస్తుందని అంటున్నారు ఫ్యాన్స్, విశ్లేషకులు... 

click me!