గ్రెగ్ ఛాపెల్, రవిశాస్త్రిని పిలిచి ఆ విషయం అడిగాడు... అది చేయడంలో ఆయన రూటే వేరు...

First Published Dec 11, 2021, 2:04 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. రవిశాస్త్రితో పాటు సహాయక కోచ్‌లుగా వ్యవహరించిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి టీమ్ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

ఆడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, ఆ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి మూడు టెస్టుల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో సిరీస్‌నే సొంతం చేసుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు...

అలాగే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత జట్టు, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి 3-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కొల్లగొట్టింది...

ఇంగ్లాండ్ టూర్‌లో హెడ్డింగ్‌లే టెస్టులో 78 పరుగులకే కుప్పకూలింది. అయితే ఆ ప్రభావం టెస్టు సిరీస్‌పై పడలేదు. నాలుగు టెస్టుల్లో రెండు విజయాలతో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది భారత జట్టు... 

ఘోర పరాజయాల తర్వాత వెంటనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తూ, క్రికెట్ ప్రపంచానికి ఆశ్చర్యానికి గురి చేసింది భారత జట్టు పర్ఫామెన్స్... దీనికి కారణం రవిశాస్త్రి స్పెషల్ స్కిల్స్ అంటున్నాడు ఆర్ శ్రీధర్...

‘రవిశాస్త్రి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. ఓ విజయం దక్కిన తర్వాత దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అందరూ చెబుతారు. అయితే బ్యాడ్ డేస్‌లో జట్టును ఎలా ఉత్తేజపరచాలో రవిశాస్త్రికి బాగా తెలుసు...

రవిశాస్త్రికి ప్లేయర్లతో చాలా మంచి రిలేషన్‌షిప్ ఉంది. ఏ క్రికెటర్ ఎలా ఆలోచిస్తాడో, ఎలా ఆడతాడో కూడా రవిశాస్త్రికి బాగా తెలుసు. టెక్నికల్లీ, మెంటల్‌గా వారికి కావాల్సిన అవసరాలను రవిశాస్త్రి ముందుగానే తెలుసుకునేవాడు...

ముఖ్యంగా ఆడిలైడ్ పరాజయం తర్వాత ఆ ఓటమి బాధను మరిచిపోగలిగేలా చేయగలిగాడు శాస్త్రి. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా టీమ్‌కి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు...

అంతేందుకు ఓసారి గ్రెగ్ ఛాపెల్ కూడా రవి భాయ్‌కి ఫోన్ చేసి... ‘అసలు మీరెలా టీమ్‌ను బౌన్స్‌బ్యాక్ చేస్తున్నారు? అసలేమీ జరగనట్టు, మ్యాచ్ ఆడనట్టు... ’ అని అడిగాడు...

రవిశాస్త్రి స్పెషాలిటీ అదే. ప్రతీ చెడ్డ రోజుని చెరిపివేసేందుకు ఓ గోల్డ్ మైన్ ఆయన దగ్గరుంది. కోచ్‌గా మాకు భిన్నాభిప్రాయలు ఉండేవి. రవి భాయ్, భరత్ సార్, సంజయ్ బంగర్ లేదా, విక్రమ్ రాథోడ్... కానీ అందరం కలిసి ఒకే లక్ష్యంతో పనిచేసేవాళ్లం...

రవి భాయ్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో పాటు మేనేజ్‌మెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆయన ప్లేయర్ల ఫెవరెట్. ప్లేయర్లకు కావాల్సిన స్వేచ్ఛను ఇస్తూనే, వారి లోపాలను సరిచేసేవారు...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...
 

click me!