వరుసగా నాలుగు విజయాలతో ఆసీస్ అదిరిపోయే కమ్‌బ్యాక్... సెమీస్ చేరిందో ఇక కష్టమే...

First Published | Oct 28, 2023, 8:02 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని వరుసగా రెండు పరాజయాలతో మొదలెట్టింది ఆస్ట్రేలియా. భారత జట్టు చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్, ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఓడింది. ఆసీస్‌కి ఈసారి కష్టమే అనుకుంటున్న తరుణంలో వరుసగా నాలుగు విజయాలతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది..

 శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న ఆసీస్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆసీస్.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది..
 

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 6 మ్యాచుల్లో 2 సెంచరీలతో 413 పరుగులు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ సెంచరీలు చేశారు...
 


Australia vs New Zealand

ఆడమ్ జంపా 6 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఇందులో 15 వికెట్లు గత నాలుగు మ్యాచుల్లోనే వచ్చాయి. మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ టాప్ క్లాస్ బౌలింగ్ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు.. 
 

ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచుల్లో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో తలబడుతోంది. ఇంగ్లాండ్‌ ఫామ్‌లో లేదు. కానీ ఆస్ట్రేలియాకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. ఆఫ్ఘాన్, బంగ్లాలపై గెలవడం ఆసీస్‌కి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు..
 

ఆస్ట్రేలియా సెమీస్ చేరిందంటే దాన్ని ఆపడం కష్టమే. ఇప్పటికే 100 వన్డే వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన మొట్టమొదటి టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియా... ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది..
 

సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఆటతీరు వేరే లెవెల్‌లో ఉంటుంది. 2003 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో భారత జట్టు కానీ, 2007 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో శ్రీలంక, 2015 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియాకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి..
 

Latest Videos

click me!